Manisha Koirala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులోకి ఒక్కసారి అడుగుపెట్టారా.. జీవితంలో ఎన్ని వచ్చినా తట్టుకొని నిలబడే శక్తిని సంపాదించుకోవాలి. అలా లేక వెనక్కి వెళ్ళిపోయినవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్.. వారి జీవితం ఒక రోజా పువ్వు మాదిరిగానే ఉంటుంది. తెరపై కనిపించేంత సంతోషం వారి జీవితాల్లో ఉండదు. ఎన్నో అడ్డంకులు, తలనొప్పులు.. సపోర్ట్ చేస్తున్నారో.. వెనక్కి లాగేస్తున్నారో వారికి తెలిసేసరికి జీవితం అయిపోతుంది. అలా ఎంతోమంది హీరోయిన్లు మోసాలను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.
కానీ, ఒక హీరోయిన్ .. కెరీర్ ను ప్రారంభించిన కొత్తలోనే స్టార్ గా ఎదిగి.. 30 ఏళ్ళ కెరీర్ లో 70 సినిమాల్లో నటించి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 మంది స్టార్స్ తో ఎఫైర్స్ నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొని .. జీవితం అంతా బావుంది అనుకొనేలోపు క్యాన్సర్ బారిన పడి.. దాన్ని జయించి ఒక వారియర్ గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన నటి మనీషా కొయిరాలా.
Venkatesh Daggubati: నమ్మినవారే రామానాయుడును మోసం చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన వెంకీ మామ
మనీషా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరికే చిలుకా వేచి ఉంటాను కడవరకు అని విరహ వేదనలో ఉన్నా, ఉట్టిమీద కూడు ఉప్పు చేప తోడు అంటూ రొమాంటిక్ మోడ్ లోకి వెళ్లినా.. అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్స్ మీరిస్తే అని దడ పుట్టించినా ఆమెనే గుర్తొస్తుంది. 1991 లో సౌదాగర్ సినిమాతో ఆమె కెరీర్ ను ప్రారంభించింది. మోడల్స్ సైతం అబ్బురపోయేలా అతిలోక సౌందర్యం ఆమె సొంతం. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో అమ్మడు ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగులో ముంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాల్లో తెలుగువారికి దగ్గరయింది. ముఖ్యంగా క్రిమినల్ సినిమాలో ఆమె నటనను.. తెలుసా మనసా సాంగ్ ను ఎవరు మర్చిపోలేరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఎవరికైనా రూమర్స్ రావడం సహజం. మనీషా 30 ఏళ్ళ కెరీర్ లో 11 మందితో ఆమె రిలేషన్ లో ఉందని బాలీవుడ్ కోడై కూస్తోంది.
2010 లో మనీషా.. సామ్రాట్ దాహల్ వివాహమాడింది. పెళ్లికి ముందు వరకు ఆమె 11 ఎఫైర్స్ నడిపింది. హీరో వివేక్ ముశ్రన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, డీజే హుసేన్, ఆర్యన్ వైడ్, ప్రశాంత్ చౌదరి, తారిఖ్ ప్రేమ్ జి, అక్షయ్, సందీప్ చౌతా.. ఇలా 11 మందితో మనీషా రిలేషన్ లోకి వెళ్లి .. చివరకు సామ్రాట్ ను వివాహమాడింది.
Crime Thriller Movie : క్లైమాక్స్ వరకు అదిరిపోయే ట్విస్టులు.. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ..
పోనీ, పెళ్లి అయ్యాకా ఈ జంట కలిసి ఉన్నారా.. ? అంటే అది లేదు. రెండేళ్లు .. కేవలం రెండేళ్లలో విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటినుంచి మనీషా ఒంటరిగానే నివసిస్తుంది. 2012లో ఆమె అండాశయ క్యాన్సర్ బారిన పడింది. చావు అంచుల వరకు వెళ్ళింది. ఎంతో కఠినతరమైన చికిత్సను తీసుకొని బతికి బయటపడింది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ – హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్‌ను ఆవిష్కరించింది ఇక చికిత్స అనంతరం మనీషా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో మనీషా బిజీగా మారింది.