E-Paper
Advertisement

డార్క్ మోడ్ Vs లైట్ మోడ్.. మీ ఫోన్ బ్యాటరీని కాపాడే అసలైన హీరో ఎవరు?

డార్క్ మోడ్ Vs లైట్ మోడ్.. మీ ఫోన్ బ్యాటరీని కాపాడే అసలైన హీరో ఎవరు?
Advertisement

Dark mode vs Light mode: ప్రస్తుత జనరేషన్‌లో స్మార్ట్‌ ఫోన్ లేనిదే ఒక్క నిమిషం కూడా గడవదు. రీల్స్ చూడటం, గేమింగ్, ఆఫీస్ వర్క్ చేసుకోవడం వల్ల ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. ఇలా ఎక్కువ సేపు ఫోన్ వాడినప్పుడు అది బాగా వేడెక్కుతుంది . ఈ హీటింగ్ ఇష్యూ, బ్యాటరీ సమస్యలకి చెక్ పెట్టడానికి ఫోన్ సెట్టింగ్స్‌లో ఉండే ‘డార్క్ మోడ్’, ‘లైట్ మోడ్’ బాగా ఉపయోగపడతాయని అంటారు. ఇంతకీ వీటిలో దేనిని ఏ టైంలో వాడాలి ? ఫోన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఏ మోడ్ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాటరీ లైఫ్‌ను పెంచడంలో ఎవరు కింగ్?

మనం వాడే స్మార్ట్‌ ఫోన్లలో ఎక్కువగా అల్మోడ్ లేదా OLED డిస్‌ప్లేలే వస్తున్నాయి. ఈ స్క్రీన్ల ప్రత్యేకత ఏంటంటే.. పిక్సెల్స్ నల్లటి రంగును చూపించడానికి ఎలాంటి పవర్‌ను తీసుకోవు. కాబట్టి మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు, స్క్రీన్ పై ఉండే నల్లటి భాగం వద్ద పిక్సెల్స్ పూర్తిగా ఆఫ్ అవుతాయి. దీని వల్ల చాలా వరకూ బ్యాటరీ సేవ్ అవుతుంది. అదే మీరు లైట్ మోడ్ వాడితే స్క్రీన్ మొత్తం ప్రకాశ వంతంగా ఉండటానికి ఎక్కువ పవర్ అవసరమవుతుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ విషయంలో.. డార్క్ మోడే క్లియర్ విన్నర్. సాధారణంగా ఇది 10% నుంచి 30% వరకు బ్యాటరీని కాపాడుతుంది.

ఫోన్‌ వేడెక్కకుండా కాపాడేది ఏది?

Advertisement

ఇక  ఫోన్ వేడెక్కడాన్ని తగ్గించే విషయంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. డార్క్ మోడ్ పెడితే ఫోన్ పూర్తిగా చల్లగా ఉంటుందని అనుకుంటారు. కానీ.. టెక్నికల్ నిపుణుల ప్రకారం, డార్క్ మోడ్ వల్ల స్క్రీన్ ప్రకాశం తగ్గుతుంది కాబట్టి ప్రాసెసర్‌పై ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. అయినప్పటికీ.. ఇది నేరుగా ఫోన్ ఉష్ణోగ్రతను, భారీగా తగ్గించేయదు. మీరు ఎండలో కూర్చుని హై-గ్రాఫిక్స్ గేమ్స్ ఆడుతుంటే లేదా వీడియో రికార్డ్ చేస్తుంటే డార్క్ మోడ్ ఉన్నా ఫోన్ వేడెక్కుతుంది. అయితే.. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే లైట్ మోడ్‌తో.. పోలిస్తే డార్క్ మోడ్ వల్ల స్క్రీన్ నుంచి వచ్చే వేడి కాస్త తక్కువగా ఉంటుంది.

Also Read: రూ.5799కే 24 ఇంచుల టీవీ..చిన్న రూమ్స్, షాపులకు ఇది పర్ఫెక్ట్!

కంటికి ఏది మంచిది?

Advertisement

రాత్రి సమయాల్లో.. లేదా తక్కువ వెలుతురు ఉండే.. గదుల్లో లైట్ మోడ్ వాడితే కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అదే డార్క్ మోడ్ వాడితే కంటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, బ్లూ లైట్ ప్రభావం కూడా తగ్గుతుంది. కానీ పగటిపూట ఎండలో నడిచేటప్పుడు లేదా బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో డార్క్ మోడ్ కంటే లైట్ మోడ్ టెక్ట్స్‌ని చదవడం చాలా ఈజీగా ఉంటుంది.

ఏది వాడాలి?

మీరు బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవాలనుకుంటే.. రాత్రి సమయాల్లో ఫోన్ వాడేటప్పుడు డార్క్ మోడ్ ఆన్ చేయడం బెస్ట్. ఇక ఫోన్‌ను వేడెక్కకుండా కాపాడుకోవాలంటే.. కేవలం డార్క్ మోడ్ మీదే ఆధారపడకుండా.. అనవసరమైన యాప్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేయడం, బ్రైట్‌ నెస్‌ని ఆటోమేటిక్‌లో ఉంచడం వంటి చిన్న చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×