BigTV English

Italy Surrogacy: అద్దె గర్భం విదేశాల్లో చేసినా ఇటలీలో శిక్ష తప్పదు.. కొత్త చట్టం ఆమోదించిన మెలోనీ సర్కార్

Italy Surrogacy: అద్దె గర్భం విదేశాల్లో చేసినా ఇటలీలో శిక్ష తప్పదు.. కొత్త చట్టం ఆమోదించిన మెలోనీ సర్కార్

Italy Surrogacy| ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ట్రాన్స్‌జెండర్ల అధికారాలకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేస్తుంటే.. ఇటలీ ప్రభుత్వం మాత్రం రివర్స్ నిర్ణయం తీసుకుంది. ఇటలీ దేశంలో ఇప్పటికే అద్దె గర్భం (సరోగసీ) పై నిషేధం ఉన్నా.. ఇప్పుడు ఇటలీ పౌరులు ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా అద్దె గర్భం సేవలు తీసుకోవడానికి వీల్లేదు. అద్దె గర్భం ప్రక్రియకు అనుమతి ఉన్న దేశాలకు వెళ్లి పిల్లలు కన్నా.. ఇటలీలో వారికి జైలు శిక్ష, అదనంగా భారీ జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఇటలీ పార్లమెంటులో కొత్త చట్టం తీసుకువచ్చారు.


అయితే ఈ చట్టం వల్ల ఎక్కువగా ట్రాన్స్‌జెండర్లకు (లింగమార్పిడి) హాని కలుగుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇటలీ దేశంలో 20 సంవత్సరాల క్రితం 2004లోనే సరోగసీ (అద్దె గర్భం)పై నిషేధం విధిస్తూ చట్టం తీసుకువచ్చారు. ఇప్పుడు సరోగసీ ఒక యూనివర్సల్ క్రైమ్ అని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ వ్యాఖ్యానించడంతో యూరోప్ దేశాలు ఇటలీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

Also Read: పారిస్‌లో పుతిన్ రహస్య కూతురు.. ఆమె తల్లి చాలా పవర్‌ఫుల్!


యూరోప్ దేశమైన గ్రీస్‌లో 2002లో సరోగసీ వ్యాపారంపై నిషేధం విధించారు. అంటే సరోగసీని సంపాదన కోసం వినియోగించకూడదు. అదే అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో అయితే సరోగసీ వ్యాపారానికి అనుమతి ఉంది. అంటే మరొకరి బిడ్డను తన గర్భంలో మోసే మహిళకు పరిహారం చెల్లించాల్సిందే. మరోవైపు యూరోప్ ప్రధాన దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలో కూడా సరోగసీపై నిషేధం ఉంది. కానీ ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో ఇతర దేశాలకు వెళ్లి సరోగసీ ద్వారా బిడ్డలను కనడంపై నిషేధం లేదు. కానీ వారు ఆ బిడ్డని తమ దేశంలోకి తీసుకొని వచ్చాక చట్టప్రకారం దత్తత తీసుకోవాల్సి ఉంటుంది.

ఇటలీ పార్లమెంటులో కొత్త చట్టం ఆమోదిస్తూ.. ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ మహిళలు, పిల్లల సంక్షేమం, భద్రత కోసమే ఈ నిషేధం తీసుకువచ్చామని తెలిపారు. ఇటలీలో అధికార పార్టీ అయిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ముందు నుంచి సరోగసీ ప్రక్రియను వ్యతిరేకిస్తూనే ఉంది. అందుకే సంప్రదాయాలను కఠినంగా పాటించే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి ఒక అతివాద పార్టీ అని ముద్ర ఉంది. ఇటలీ సరోగసీ ద్వారా జన్మించిన పిల్లలకు వారసత్వంగా సమాన హక్కులు ఉండవు.

ఈ మేరకు యూరోపియన్ మానవ హక్కుల కోర్టులో 2014లో ఒక కేసు కూడా విచారణకు వచ్చింది. ఫ్రాన్స్ దేశంలో సరోగసీ చట్టంపై నిషేధం ఉండడంతో సరోగసీ ద్వారా పుట్టిన ఒక బిడ్డకు వారసత్వ హక్కులు లభించలేదు. దీంతో మెన్నెసన్ వర్సెస్ ఫ్రాన్స్ కేసులో కోర్టు న్యాయపరంగా ఆ బిడ్డకు సమాన హక్కులు ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. యూరోప్ మానవ హక్కుల కోర్టు తీర్పును అప్పుడు ఫ్రాన్స్ తో సహా ఇటలీ కూడా వ్యతిరేకించడం గమనార్హం.

క్రైస్తవ మత ఆచారాలను కఠినంగా పాటించాలని చెప్పే చర్చిలకు వంత పాడే ఇటలీ ప్రభుత్వం ఆది నుంచి సంప్రదాయ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ.. పిల్లల దత్తత, ట్రాన్స్ జెండర్ల వివాహాలు, LGBTQ+ అధికారాలకు వ్యతిరేకిస్తూనే ఉంది. అయితే ఇటలీ ప్రభుత్వ నిర్ణయాలను ట్రన్స్‌జెండర్ కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చట్టం కేవలం తమను టార్గెట్ చేయడానికే నని వాదిస్తున్నారు.

సహజంగా వివాహ బంధంలో ఉన్న స్త్రీ, పురుషులకు పిల్లలు పుట్టకపోతే వారు రహస్యంగా ఇతర దేశాలకు వెళ్లి సరోగసీ ద్వారా పిల్లలుకంటున్నారని. వారు తిరిగి ఇటలీకి వచ్చినా ఎవరికి అనుమానం రాదని.. కానీ ట్రాన్స్ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వారు రహస్యంగా కూడా సరోగసీ ఆశ్రయించలేరని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు కనాలనే ట్రాన్స్ జెండర్లకు ఇటలీ చట్టాలతో చాలా అన్యాయం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×