E-Paper
Advertisement

ఇక బెడ్ పైనుంచి లేవక్కర్లేదు.. రిమోట్ నొక్కితే చాలు! ఏసీ లాంటి గాలి

ఇక బెడ్ పైనుంచి లేవక్కర్లేదు.. రిమోట్ నొక్కితే చాలు! ఏసీ లాంటి గాలి
Advertisement

Defender bldc ceiling fan 1200mm: ఎండలు మండిపోతున్నా, వర్షం పడుతున్నా ఇంట్లో ఫ్యాన్ 24 గంటలు తిరగాల్సిందే. కానీ నెల చివర్లో వచ్చే కరెంట్ బిల్లు చూస్తే గుండె గుభేల్ అంటుంది. అందుకే ఇప్పుడు అందరూ నార్మల్ ఫ్యాన్లను పక్కన పెట్టి BLDC ఫ్యాన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లోకి సరికొత్తగా, సూపర్ స్టైలిష్ లుక్‌తో దూసుకొచ్చింది Defender 1200 mm BLDC Ceiling Fan. రిమోట్ ఆపరేషన్.. ఏకంగా 5 ఏళ్ల వారంటీతో వస్తున్న ఈ ఫ్యాన్ కేవలం రూ.2,399 లకే లభిస్తోంది. దీని గురించిన పూర్తి వివరాలు మీకోసం!

Defender 1200 mm సీలింగ్ ఫ్యాన్ పూర్తి ఫీచర్లు:

సాధారణంగా మనం వాడే పాతకాలపు సీలింగ్ ఫ్యాన్లు దాదాపు 75 నుంచి 80 వాట్ల కరెంటును గుంజేస్తాయి. కానీ ఈ డిఫెండర్ BLDC ఫ్యాన్ కేవలం 28 నుంచి 35 వాట్లను మాత్రమే వాడుకుంటుంది. అంటే మీ పాత ఫ్యాన్‌తో పోలిస్తే.. ఇది సగానికి పైగా కరెంటును ఆదా చేస్తుంది. లాంగ్ రన్‌లో ఇది మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

1.రిమోట్ కంట్రోల్ :

Advertisement

ఈ ఫ్యాన్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీనితో పాటు వచ్చే స్మార్ట్ రిమోట్. రాత్రి పూట పడుకున్నాక చలి వేసినా లేదా గాలి పెంచాలనుకున్నా.. బెడ్ పైనుంచి లేవాల్సిన పనే లేదు. రిమోట్ బటన్ నొక్కితే చాలు, ఫ్యాన్ స్పీడ్ మారిపోతుంది. ఇందులో టైమర్ సెట్టింగ్స్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. దీని వల్ల అర్ధరాత్రి ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా టైమర్ సెట్ చేసుకుంటే సరిపోతుంది.

2.1200 mm వైడ్ బ్లేడ్స్:

కొన్ని ఫ్యాన్లు తిరుగుతాయి కానీ పక్కకు వెళ్తే అస్సలు గాలి రాదు. కానీ ఈ డిఫెండర్ ఫ్యాన్ 1200 mm (48 ఇంచులు) స్వీప్ సైజ్‌తో వస్తుంది. దీని ఏరోడైనమిక్ బ్లేడ్స్ డిజైన్ వల్ల రూమ్ లోని ప్రతి మూలకు సమానంగా, పవర్‌ఫుల్ గాలి అందుతుంది. హాల్ కైనా, బెడ్‌రూమ్‌ కైనా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

3. ఐదేళ్ల గ్యారెంటీ:

Advertisement

మార్కెట్లో చాలా బ్రాండ్లు ఒకటి లేదా రెండు సంవత్సరాల వారంటీ ఇస్తాయి. కానీ డిఫెండర్ బ్రాండ్ తమ మోటార్ పై ఏకంగా 5 Years Warranty అందిస్తోంది. అంటే ఐదేళ్ల పాటు ఫ్యాన్ మోటార్ కి ఎలాంటి రిపేర్ వచ్చినా కంపెనీయే బాధ్యత వహిస్తుంది. కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఇదొక్క ఫీచర్ చాలు.

4.శబ్దం లేని ప్రశాంతమైన నిద్ర:

పాత ఫ్యాన్లు తిరుగుతుంటే.. ‘కిర్ కిర్’ అంటూ వచ్చే శబ్దం నిద్రను పాడు చేస్తుంది. ఈ BLDC ఫ్యాన్‌లో బ్రష్‌లు లేని అడ్వాన్స్‌డ్ మోటార్ ఉండటం వల్ల, ఇది అత్యంత నిశ్శబ్దంగా తిరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే ఇన్వర్టర్ కనెక్షన్ పై కూడా ఇది సాధారణ ఫ్యాన్ కంటే డబుల్ టైమ్ బ్యాకప్ ఇస్తుంది.

Also Read: పార్టీలకి బాస్ వచ్చేసాడు! 80W బేస్ ఎఫెక్ట్‌తో.. కొత్త బ్లూటూత్ స్పీకర్ రచ్చ!

5. ధర, ఆఫర్ వివరాలు:

ప్రస్తుతం మార్కెట్లో మంచి బ్రాండెడ్ BLDC ఫ్యాన్ కొనాలంటే కనీసం 3 వేల నుంచి 4 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. కానీ ఈ డిఫెండర్ 1200 mm BLDC సీలింగ్ ఫ్యాన్ అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.2,399 లకే అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్‌లో 5 ఏళ్ల వారంటీ, రిమోట్ కంట్రోల్ రావడం నిజంగా గొప్ప విషయం.

తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే  స్మార్ట్ హోమ్ అప్లయన్స్ కోసం చూసేవారికి రూ.2,399 లకే లభిస్తున్న ఈ డిఫెండర్ BLDC సీలింగ్ ఫ్యాన్ ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్, కరెంట్ ఆదా, రిమోట్ కంఫర్ట్ అన్నీ కలిపి ఒకే ప్యాకేజీలో వస్తున్నాయి. స్మార్ట్‌గా ఆలోచించి, మీ పాత ఫ్యాన్‌ను మార్చేసి ఈ రోజే దీన్ని ఇంటికి తెచ్చుకోండి.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×