Vivo Y300 5G : వివో వై సిరీస్ లో భాగంగా లాంఛ్ చేసిన Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రిలీజ్ అయిపోయింది. ఈ మెుబైల్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చేసింది. ఇక రెండు వేరియంట్స్ లో వచ్చేసిన ఈ మెబైల్ ధరలు రూ.21,999, రూ. 23,999గా వివో నిర్ణయించింది. ఇక ప్రీ-బుకింగ్స్, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లను సైతం అందిస్తుంది. నవంబర్ 26 ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపింది.
చైనీస్ టెక్ దిగ్గజం Vivo భారత్ లో తన Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దాని Y-సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ ఈ మెుబైల్ ను తీసుకొచ్చేసింది. ఇక ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఈ మెుబైల్ ధరలు సైతం అందుబాటులోనే ఉండటంతో టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Vivo Y300 5G Specifications (స్పెసిఫికేషన్లు) –
Vivo Y300 5G మూడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ కలర్స్. ఇక FULL HD + (1,080 x 2,400 పిక్సెల్) AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్, 394ppi పిక్సెల్ డెన్సిటీతో వచ్చేసింది.
ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో 8GB LPDDR4X RAMతో లాంఛ్ అయింది. ఇక మరో 8GB వరకు విస్తరించే అవకాశం ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ ను 256GB వరకూ పెంచే అవకాశం ఉంది. మైక్రో SD కార్డ్ తో 2TB వరకు మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.
ఈ మెుబైల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చేసింది. ఫోటోగ్రఫీకు 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం 32MP కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 80 శాతం ఛార్జ్ చేస్తుంది.
ఇక మిగిలిన ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G తో పాటు 4G, Wi-Fi, బ్లూటూత్ 5.0, OTG, GPS, NavIC, BeiDou, Galileo వంటి నావిగేషన్ సిస్టమ్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది Android 14 ఆధారిత FuntouchOS 14 పై పనిచేస్తుంది.
ధర – Vivo Y300 5G రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB + 128GB మోడల్ ధర రూ.21,999, 8GB + 256GB మోడల్ ధర రూ.23,999. Vivo ఇండియా ఇ-స్టోర్ ద్వారా ప్రీ-బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక సాధారణ విక్రయాలు నవంబర్ 26న ప్రారంభమవుతాయి
ప్రీ-బుక్ చేసే కొనుగోలుదారులు ఫ్లాట్ రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీనితో పాటు రోజుకు రూ. 43తో ప్రారంభమయ్యే EMI ఆఫ్షన్ ను ఎంపికను ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ ను ఎంపిక చేసిన కస్టమర్స్ కు అదనంగా రూ.1,000 తగ్గింపును అందిస్తుంది. ఇక ఆరు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం సైతం అందుబాటులో ఉంది.
ALSO READ : బ్లాక్ ఫ్రైడే సేల్లో టాప్ లేచిపోయే ఆఫర్స్.. డేట్స్, డిస్కౌంట్స్, ఫ్లాట్ఫామ్స్ వివరాలివే!