Dhravya Shah: అమెరికాలో ఉద్యోగం వస్తే చాలను అనుకునేవారు యువతీ యువకులు ఎందరో ఉన్నారు. ఇదంతా ఒకప్పటి మాట. ఏఐ వచ్చిన తర్వాత పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. దేశంలో యువత తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. చిన్న వయస్సులో అద్భుతాలను సృష్టిస్తున్నారు. స్టార్టప్‌లను ప్రారంభించడం మొదలుపెట్టారు. అలాంటి వారిలో ధ్రవ్య షా ఒకరు. రెండు పదుల వయస్సు లేని ఈ యువకుడు ఏకంగా అమెరికాలో ఒ-1 వీసా సాధించడం టెక్ వర్గాలు షాకవుతున్నాయి.
టెక్ ప్రపంచంలోకి యంగ్ భారతీయులు అడుగులు
ధ్రవ్య షా.. ఈ యువకుడి పేరు ప్రస్తుతం టెక్ రంగంలో మార్మోగుతోంది. నూనూగు మీసాలు రాని 20 ఏళ్లు యువకుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సరదాగా కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేసినవాడే. చదువులో టాపర్.. మూడేళ్లు తాను చేపట్టిన ప్రాజెక్టుపై పని చేశాడు ఆ తర్వాత ఐఐటీ వదిలేశాడు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు, వీసా సమస్యలున్నా అతడి నమ్మకం ముందుకు నడిపించింది.
చాలా మంది విద్యార్థులు తమ కళాశాల ప్లేస్‌మెంట్‌లు, గ్రాడ్యుయేట్ కోసం సిద్ధం అవుతారు. కానీ బీటెక్ చదువుని తన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. 20 ఏళ్లు నిండకముందే భారతీయ యుంగ్ టెక్ బిజినెస్‌మేన్ 15కు పైగా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాడు. అందులో రెండింటిని అమ్మేశాడు. తన ప్రాజెక్టు సూపర్ మెమరీ కోసం 3 మిలియన్ డాలర్లను సమీకరించాడు.
ధ్రవ్య షా.. ఐఐటీ డ్రాట్, ఆశ్చర్యపోయిన టెక్ దిగ్గజాలు
ఇంటెలిజెంట్ ఏజెంట్ల కోసం మెమరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసి AI స్టార్టప్‌ను నిర్మించాడు. ధ్రవ్య షా సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంది. వేసే అడుగు.. ప్రతీ క్షణం తాను చేస్తున్న ప్రాజెక్టుపై ఆలోచించేవాడు. తాను నిర్మించిన ప్రాజెక్టు నుంచి పుట్టింది ఎనీకాంటెక్స్ట్ అనే టూల్. యూజర్లు తమ పర్సనల్ డేటాను మేనేజ్ చేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులను క్షణ్నంగా గమనించాడు.
వారి నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేశాడు. టెక్ దిగ్గజాలను ఆకట్టుకున్న సూపర్ మెమరీ.. ఇప్పుడు స్టార్టప్‌గా రూపాంతరం చెందింది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో అలాగే పర్సనల్ ఏఐ ఏజెంట్ ఉంటుందని అంటున్నాడు.
ఏఐ ఎంత పవర్‌ఫుల్ అనేదానికంటే మీ గురించి దానికి ఎంత గుర్తు ఉంటుంది, ఎంత కాంటెక్స్ట్ తెలుసు అనేది అసలైది, అదే గేమ్‌చేంజర్ అవుతుందని చెప్పుకొచ్చాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో మెమరీ ముఖ్యమని నమ్మాడు.మార్కెట్లో ఉన్న చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని వంటి ఏఐ మోడల్స్ ఎంత శక్తివంతమైనవి. అయితే వాటికి పాత విషయాలను గుర్తుపెట్టుకునే సామర్థ్యం తక్కువ.
ఈ పాయింట్‌ని పట్టుకుని ప్రాజెక్టు మొదలుపెట్టాడు ధ్రవ్య షా. ఏఐ అప్లికేషన్లు.. పాత ఈ-మెయిల్స్, చాట్స్, పీడీఎఫ్ ఫైల్స్, పర్సనల్ నోట్స్ వంటి రకరకాల డేటాను గుర్తుంచుకుని క్షణాల్లో వెతికి పెట్టేలా మెమరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బిల్డ్ చేస్తున్నాడు. టెక్నాలజీ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ధ్రవ్య సలహా ఒక్కటే.
ALSO READ: ఏసీ కొనడానికి ఇదే రైట్ టైం బాస్! అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో.. వేలల్లో డిస్కౌంట్
ఆన్‌లైన్ గుర్తింపు కోసం వెంపలాడకుండా, నిజమైన సమస్యలకు పరిష్కారాలు వెతకాలన్నాడు. నిరంతరం కొత్తవి సృష్టించి ప్రపంచంతో పంచుకోవాలన్నాడు. తన తొలి ప్రాజెక్టుకు పెద్దగా గుర్తింపు రాలేదని, కానీ వాటిని ప్రచురించడం ద్వారా తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, విశ్వసనీయతను పెంచుకోవడానికి సహాయపడిందని చెప్పాడు.
అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ఒకప్పుడు వీసా కోసం లేనిపోని ఇబ్బందులు పడిన ధ్రవ్య.. సైన్స్, బిజినెస్, ఆర్ట్స్ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ఒ-1 వీసాను ఇస్తోంది అమెరికా. అందులోని టాప్ సైంటిస్టులు, నోబెల్ అవార్డులు విజేతలు ఉంటారు.
అలాంటి వీసాను 20 ఏళ్లు నిండని ఓ యువ భారతీయ దక్కించుకోవడం టెక్ నిపుణులను విస్మయానికి గురిచేసింది. అన్నట్లు మొన్నటికి మొన్న జైనమ్ జైన్ కూడా కేవలం 14 ఏళ్లకు ఏఐ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశాడు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ లో తన ఆఫీసు ప్రారంభించిన విషయం తెల్సిందే.