E-Paper
Advertisement

రూ.705కే 16W సౌండ్‌బార్..పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోడల్

రూ.705కే 16W సౌండ్‌బార్..పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోడల్
Advertisement

Soroo Future 16W soundbar: ల్యాప్ ట్యాప్ లేదా డెస్క్‌టాప్ వాడేటప్పుడు మంచి సౌండ్ రావట్లేదని బాధపడుతున్నారా? తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే ఆడియో ఫీల్ అందించడానికి మార్కెట్లోకి వచ్చేసింది ‘సోరూ ఫ్యూచర్ 16W’ (Soroo Future)5.0 ఛానెల్ సౌండ్‌బార్. కేవలం రూ.705 ధరకే లభిస్తున్న ఈ పోర్టబుల్ స్పీకర్, హెచ్‌డీఎంఐ, వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తోంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ ట్రెండీ గ్యాజెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోరూ ఫ్యూచర్ 16W ఫీచర్లు: 

Advertisement

1.డిజైన్ :

ప్రస్తుత కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, ఆన్‌లైన్ క్లాసులు వినేవారు, సినిమాలు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే .. చాలా లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లలో వచ్చే బిల్ట్-ఇన్ స్పీకర్ల సౌండ్ సరి పోదు. అలాంటి వారి కోసం అతి తక్కువ ధరలో అద్భుతమైన ఆడియోను అందించేందుకు ప్రముఖ బ్రాండ్ సోరూ తన ‘ఫ్యూచర్’ సిరీస్‌లో భాగంగా 16W సౌండ్‌బార్‌ను పరిచయం చేసింది. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చి, మీ కంప్యూటర్ టేబుల్ మీద చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీని ప్రీమియం లుక్ మీ గదికి లేదా ఆఫీస్ డెస్క్‌కు ట్రెండీ రూపాన్ని ఇస్తుంది.

Advertisement

2.సౌండ్ పవర్:

ఈ సౌండ్‌బార్  పరిమాణంలో.. చిన్నగా ఉన్నప్పటికీ, దీని ఫర్మామెన్స్ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇందులో.. 16 వాట్ల (16W) సౌండ్ అవుట్‌పుట్ లభిస్తుంది. ఇది 5.0 ఛానెల్ టెక్నాలజీతో పని చేయడం.. వల్ల మ్యూజిక్ వింటున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు శబ్దం చాలా స్పష్టంగా, డీప్ బేస్‌తో వినిపిస్తుంది. సినిమా పాటలు లేదా గేమింగ్ సమయంలో ఇది మంచి ఆడియో ఎక్స్‌పీరియాన్ని ఇస్తుంది.

3.కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లు దొరకడం విశేషం. ఇందులో వైర్‌లెస్ బ్లూటూత్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌టాప్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎంఐ పోర్ట్ సపోర్ట్ ఉండటం వల్ల టీవీలు లేదా ఇతర సిస్టమ్స్‌కు కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. వైరు లేకుండా లేదా వైర్లతో కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.

Also Read: లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.579 కే హామర్ ఇయర్ బడ్స్ లాంచ్!

4.ల్యాప్‌టాప్ , డెస్క్‌టాప్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్:

మీరు ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఎదుటి వారి గొంతు స్పష్టంగా.. వినడానికి ఈ స్పీకర్ చాలా బాగా సహాయ పడుతుంది.అలాగే.. రోజంతా సిస్టమ్ ముందు గడిపేవారు అలసట లేకుండా పాటలు వింటూ ప్రశాంతంగా పని చేయడానికి ఇది చక్కటి తోడుగా నిలుస్తుంది. ఇది యూజ్ చేయడం చాలా ఈజీ, కేవలం ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఇది పని చేస్తుంది.

5.ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ సోరూ ఫ్యూచర్ 16W బ్లూటూత్ సౌండ్‌బార్ మార్కెట్లో.. ఆఫర్ ధర కింద కేవలం రూ.705 ధరకే అందుబాటులో ఉంది. వెయ్యి రూపాయల లోపు.. బడ్జెట్‌లో ఇంత మంచి ఫీచర్లు ఉన్న స్పీకర్ దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో మీ లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ సౌండ్‌ను పెంచుకోవాలనుకుంటే సోరూ ఫ్యూచర్ 16W సౌండ్‌బార్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ సౌండ్ ఫీల్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్!

Related News

రూ.30 వేల ఫోన్.. చైనాలో రూ.15 వేలే ఎందుకు? మనం ఎక్కువ ఇస్తున్నామా?

రూ.899కే అదిరిపోయే ఇయర్ బడ్స్..తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్వాలిటీ

రూ.999కే హోమ్ థియేటర్ సౌండ్..మార్కెట్లో జెబ్రోనిక్స్ విటా బార్ రచ్చ

ఇంత తక్కువకి OnePlus 13 మళ్లీ దొరకదు.. Flipkart Freedom Saleలో క్రేజీ ప్రైస్ డ్రాప్!

రూ.15,999కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ..వెంటనే కొనేయండి

లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.579 కే హామర్ ఇయర్ బడ్స్ లాంచ్!

రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!

Big Stories

Advertisement
×