E-Paper
Advertisement

రూ.999కే హోమ్ థియేటర్ సౌండ్..మార్కెట్లో జెబ్రోనిక్స్ విటా బార్ రచ్చ

రూ.999కే హోమ్ థియేటర్ సౌండ్..మార్కెట్లో జెబ్రోనిక్స్ విటా బార్ రచ్చ
Advertisement

Zebronics Vita Bar 202 soundbar: ఇంట్లో ఉన్నా, బయట ప్రయాణాలు చేస్తున్నా మ్యూజిక్ లేకుండా ఉండలేకపోతున్నారా? తక్కువ బడ్జెట్‌లో సినిమా థియేటర్ లాంటి ఫీల్ పంచడానికి మార్కెట్లోకి వచ్చేసింది ‘జెబ్రోనిక్స్ విటా బార్ 202’ పోర్టబుల్ సౌండ్‌బార్. కేవలం రూ.999 ధరకే లభిస్తున్న ఈ స్పీకర్, శక్తివంతమైన డ్యూయల్ డ్రైవర్లు, TWS ఫీచర్‌తో వస్తోంది. స్టైలిష్ లుక్,బెస్ట్ సౌండ్‌తో యూజర్లను ఫిదా చేస్తున్న ఈ ట్రెండీ గ్యాజెట్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జెబ్రోనిక్స్ విటా బార్ 202 ఫీచర్లు:

1. డిజైన్:

ప్రస్తుత కాలంలో మ్యూజిక్ లవర్స్ అందరూ.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లే పోర్టబుల్ స్పీకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ తన సరి కొత్త ‘విటా బార్ 202’ (Vita Bar 202) సౌండ్‌బార్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. మీ ఆఫీస్ డెస్క్ మీద, బెడ్‌రూమ్‌లో లేదా లివింగ్ రూమ్‌లో ఎక్కడ పెట్టుకున్నా ఇది మీ ఇంటీరియర్‌కు చక్కటి లుక్‌ని ఇస్తుంది. దీన్ని బ్యాగ్‌లో సర్దుకోవడం కూడా చాలా ఈజీ.

2. బెస్ట్ సౌండ్:

Advertisement

ఈ సౌండ్‌బార్ స్పెషల్ ఫీచర్ ఇందులో ఉండే డ్యూయల్ డ్రైవర్లు. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. ఈ డ్రైవర్ల సహాయంతో ఇది గది మొత్తం మార్మోగేలా స్పష్టమైన, గట్టి ఆడియోను అందిస్తుంది. పాటలు వింటున్నప్పుడు డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ను ఇది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తుంది. సినిమాలు చూసేటప్పుడు లేదా మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు ఇది అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.

3.కనెక్టివిటీ, TWS ఫీచర్:

ఈ బడ్జెట్ స్పీకర్‌లో లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ బ్లూటూత్ సపోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌టాప్‌కు దీన్ని క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే .. ఇందులో ప్రత్యేకమైన TWS ఫీచర్ ఇవ్వబడింది. దీని వల్ల మరో జెబ్రోనిక్స్ విటా బార్ స్పీకర్‌ను దీనికి జత చేసి మరింత పెద్ద సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఎఫ్‌ఎం రేడియో, యూఎస్‌బీ, ఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

4.బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:

Advertisement

ప్రయాణాలు చేసేవారికి.. ఎలాంటి అడ్డంకులు లేకుండా మ్యూజిక్ వినేందుకు ఇది చక్కటి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై.. ఇది సుమారు 6 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను ఇస్తుంది. ఇందులో.. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉండటం వల్ల త్వరగా, ఈజీగా ఛార్జ్ అవుతుంది. రోజంతా టెన్షన్ లేకుండా.. మ్యూజిక్‌తో గడపాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.579 కే హామర్ ఇయర్ బడ్స్ లాంచ్!

5.ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ జెబ్రోనిక్స్ విటా బార్ 202 పోర్టబుల్ సౌండ్‌బార్ మార్కెట్లో ప్రత్యేక ఆఫర్ కింద కేవలం రూ.999 ధరకే అందుబాటులో ఉంది. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో ..డ్యూయల్ డ్రైవర్లు ఉన్న సౌండ్‌బార్ దొరకడం నిజంగా గొప్ప విషయమే.

తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్, స్టైలిష్ లుక్ , పోర్టబుల్ డిజైన్ కోరుకునే వారికి జెబ్రోనిక్స్ విటా బార్ 202 ఒక అద్భుతమైన ఆప్షన. మీ రోజువారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుకోవడానికి ఈ స్పీకర్‌ను ఈరోజే మీ సొంతం చేసుకోండి!

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×