BSNL Freedom Offer: దేశీయ టెలికాం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL పండుగ వేళ మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక ‘ఫ్రీడమ్ ఆఫర్’ కు లభిస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని, దీని గడువును వచ్చే సెప్టెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
రూపాయికే కొత్త సిమ్ కార్డ్!
సాధారణంగా కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలంటే రూ.20 నుండి రూ.50 వరకు ఖర్చవుతుంది. కానీ ఈ ఆఫర్ కింద బిఎస్ఎన్ఎల్ కేవలం రూపాయికే కొత్త సిమ్ కార్డును అందిస్తోంది. దీనికి తోడు 24 రోజుల వ్యాలిడిటీతో రోజూ 1GB డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం లభిస్తుంది. తక్కువ ఖర్చుతో కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం అనే చెప్పవచ్చు.
రూ.2,399 ప్లాన్ పై బంపర్ బెనిఫిట్స్..
వార్షిక రీచార్జ్ ప్లాన్లను వాడేవారికి బిఎస్ఎన్ఎల్ మరో మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా రూ. 2,399 ప్లాన్ పై 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫర్ కింద దానికి మరో 47 రోజులు అదనంగా కలిపి మొత్తం 412 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నారు. అంటే ఏడాదికి పైగానే రీచార్జ్ బాధ లేకుండా వాడుకోవచ్చు.
ఈ ప్లాన్‌పై రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 SMSలు, అపరిమిత ఉచిత కాలింగ్ లభిస్తాయి. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల రీచార్జ్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో BSNL అందిస్తున్న ఈ ఆఫర్ ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది.
సెప్టెంబర్ 12 వరకు మాత్రమే..
నెట్‌వర్క్ రీచార్జ్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి, అలాగే సెకండరీ సిమ్ వాడుతున్న వారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని వినియోగదారులు దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ లేదా అధికారిక రిటైలర్ల వద్ద పొందవచ్చు.