E-Paper
Advertisement

రూ.15,999కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ..వెంటనే కొనేయండి

రూ.15,999కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ..వెంటనే కొనేయండి
Advertisement

Thomson 43 inch Smart TV: ఇంట్లో కూర్చుని సినిమా థియేటర్ ఫీల్ పొందాలనుకుంటున్నారా? అదీ తక్కువ బడ్జెట్‌లో.. పెద్ద స్క్రీన్ టీవీ కోరుకుంటున్నారా? అయితే.. మీకోసమే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో.. వచ్చేసింది ‘థామ్సన్ వరల్డ్ కప్ 43 ఇంచెస్’ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ. కేవలం రూ.15,999 ధరకే లభిస్తున్న ఈ టీవీ,40W సౌండ్ అవుట్‌పుట్, ఆకర్షణీయమైన బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే పిక్చర్ క్వాలిటీతో.. యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్ టీవీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

థామ్సన్ వరల్డ్ కప్ 43 ఇంచెస్’ టీవీ ఫీచర్లు:

1.డిజైన్:

Advertisement

ప్రస్తుత కాలంలో ఇంటికి ఒక స్మార్ట్ టీవీ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేందుకు పెద్ద స్క్రీన్ టీవీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ తన ‘వరల్డ్ కప్’ సిరీస్‌లో భాగంగా 43 ఇంచెస్ (108 సెం.మీ) ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ లినక్స్ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. మోడల్ నంబర్ 43Alpha005BL కలిగిన ఈ టీవీ, చూడటానికి చాలా సన్నని బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది.కాబట్టి ఇది మీ లివింగ్ రూమ్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

2.పిక్చర్ క్వాలిటీ :

Advertisement

ఈ టీవీ యొక్క డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇది ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇందులో.. ఉన్న ‘వివిడ్ కలర్’ టెక్నాలజీ వల్ల స్క్రీన్‌పై రంగులు చాలా సహజంగా,ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దీని.. వైడ్ వ్యూ యాంగిల్ సపోర్ట్ కారణంగా గదిలో.. ఏ కోణం నుంచి చూసినా పిక్చర్ క్లారిటీ ఏమాత్రం తగ్గదు. సినిమాలు లేదా మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు ఇది మంచి విజువల్ ఫీల్ ఇస్తుంది.

3.40W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్:

సాధారణంగా ఈ బడ్జెట్ టీవీలలో తక్కువ సౌండ్ స్పీకర్లు వస్తుంటాయి. కానీ..థామ్సన్ ఈ మోడల్‌లో ఏకంగా 40 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఇచ్చే పవర్‌ఫుల్ స్పీకర్లను అమర్చింది. దీని వల్ల ప్రత్యేకంగా హోమ్ థియేటర్ లేదా సౌండ్ బార్ కొనాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే దద్దరిపోయే ఆడియో ఫీల్ పొందవచ్చు.

Also Read: రూ.599కే ఇయర్ బడ్స్.. గేమింగ్,మ్యూజిక్ లవర్స్‌కు బెస్ట్ తెలుసా ?

4.స్మార్ట్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్:

ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో.. ఇన్‌బిల్ట్ వెబ్ బ్రౌజర్ ఉండటం వల్ల నేరుగా ఇంటర్నెట్ సర్ఫ్ చేయవచ్చు. అలాగే.. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఇందులో.. ప్రత్యేకంగా ‘స్పోర్ట్స్ మోడ్’ఇవ్వబడింది. ఇది గేమ్స్ చూసేటప్పుడు మోషన్ బ్లర్‌ను తగ్గించి, స్టేడియంలో ఉన్నంత ఫీల్ అందిస్తుంది.

5.ధర:

అన్ని లేటెస్ట్ హంగులు కలిగిన ఈ థామ్సన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ మార్కెట్లో ఆఫర్ ధర కింద కేవలం రూ. 15,999 ధరకే అందుబాటులో ఉంది. రూ. 16,000 లోపు బడ్జెట్‌లో ఇంత పెద్ద స్క్రీన్, 40W సౌండ్ ఉన్న టీవీ దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

బడ్జెట్ ధరలో మంచి సౌండ్,అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, ట్రెండీ డిజైన్ కోరుకునే వారికి థామ్సన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ ఇంటో ఎంటర్‌టైన్‌మెంట్‌ను డబల్ చేసుకోవడానికి ఈ టీవీ బెస్ట్.

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×