Flipkart Freedom Sale 2026: జెన్యూన్‌గా చెప్పాలంటే.. OnePlus 13 కొనడానికి ఇంతకంటే బెస్ట్ టైమ్ మళ్లీ రాదేమో. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ పుణ్యమా అని ఈ ప్రీమియం ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కేవలం బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తోనే భారీ ధర తగ్గింపు లభించడంతో పాటు ఎక్స్ఛేంజ్ కూడా కలిపితే రేటు ఎక్కడికో పడిపోతుంది. అసలు ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటి? ధర ఎంత తగ్గింది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
మార్కెట్లోకి వచ్చిన కొత్తలో ఈ ఫోన్ రూ.69,999 ధరతో లాంచ్ అయింది. అయితే ప్రస్తుత సేల్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.61,990కే లిస్ట్ అయింది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే అదనంగా రూ.3,575 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.58,415కి పడిపోతుంది. అంతేకాకుండా.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.55,200 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభించే అవకాశం ఉంది. అయితే ఇది మీ పాత ఫోన్ కండిషన్ బట్టి మారుతుంది.
Also Read: రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!
ఈ OnePlus 13 డిస్‌ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిలో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఎల్‌టీపీవో 4.1 ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్ ఇచ్చారు. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏకంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను వాడారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ OnePlus 13లో 5G, వైఫై 7, బ్లూటూత్ వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు అన్నీ ఉన్నాయి.
ఫొటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా OnePlus 13 ఫోన్ కెమెరా సెటప్ ఉంటుంది. వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చారు. మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రావైడ్ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ దీని ప్రత్యేకత. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
OnePlus 13 బరువు సుమారు 213 గ్రాములు ఉండగా.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాలతో వస్తున్న ఈ OnePlus 13.. ప్రస్తుత సేల్ ధర ప్రకారం చూస్తే ఖచ్చితంగా డబ్బుకు తగిన విలువైన ఫోన్ అని చెప్పవచ్చు. ప్రీమియం ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.
Also Read: బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఏఐ కెమెరాలు, గూగుల్ జెమిని ఫీచర్లతో ఆ తేదీన లాంచ్!