E-Paper
Advertisement

లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.579 కే హామర్ ఇయర్ బడ్స్ లాంచ్!

లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.579 కే హామర్ ఇయర్ బడ్స్ లాంచ్!
Advertisement

Hammer Airflow Neo earbuds:  తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే ప్రముఖ బ్రాండ్ హామర్ (Hammer) నుంచి సరి కొత్త ‘ఎయిర్‌ఫ్లో నియో’ మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ.579 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, స్టైలిష్ గ్రే కలర్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఏకంగా 80 గంటల బ్యాటరీ బ్యాకప్, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తున్న ఈ ట్రెండీ గార్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.డిజైన్ ప్రత్యేకతలు:

ప్రస్తుత రోజుల్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం చాలా వరకు విపరీతంగా పెరిగింది. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసులో పనులకు లేదా కాలేజీకి వెళ్లేటప్పుడు ఇయర్ బడ్స్ ఉండటం మామూలైపోయింది. ఈ తరుణంలో సామాన్యులకు సైతం అత్యంత తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ పంచేందుకు ‘హామర్’ సంస్థ తన ఎయిర్‌ఫ్లో సిరీస్‌లో ‘నియో మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఇయర్ బడ్స్ గ్రే కలర్‌లో చాలా ట్రెండీగా ఉండి, చెవిలో సౌకర్యంగా ఇమిడిపోతాయి.

2.సౌండ్ క్వాలిటీ, టైటానియం డ్రైవర్లు:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ ధర తక్కువగా ఉన్నప్పటికీ.. సౌండ్ విషయంలో అస్సలు రాజీ పడలేదు. ఇందులో.. శక్తివంతమైన 13mm టైటానియం డ్రైవర్లను వాడారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ ఆడియోను ఆస్వాదించవచ్చు. మ్యూజిక్ లవర్స్‌కు ఇది నిజంగా మంచి ఫీల్ ఇస్తుంది.

3.గేమింగ్ మోడ్, కనెక్టివిటీ:

Advertisement

గేమ్స్ ఆడే యూత్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఇందులో.. 40ms అల్ట్రా-లో లాటెన్సీ గేమింగ్ మోడ్ ఇవ్వబడింది. దీని వల్ల గేమింగ్ సమయంలో ఆడియో, వీడియో మధ్య ఎలాంటి డిలే ఉండదు. అలాగే లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ కారణంగా మీ స్మార్ట్‌ ఫోన్‌కు ఇయర్ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి.అంతే కాకుండా కనెక్షన్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది.

Also Read: రూ.599కే ఇయర్ బడ్స్.. గేమింగ్,మ్యూజిక్ లవర్స్‌కు బెస్ట్ తెలుసా ?

4.80 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఈ ఇయర్ బడ్స్ అత్యంత ముఖ్యమైన హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో .. కలిపి ఇది ఏకంగా 80 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ గురించే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

5.ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ హామర్ ఎయిర్‌ఫ్లో నియో ఇయర్ బడ్స్ మార్కెట్లో ప్రత్యేక ఆఫర్ కింద కేవలం రూ.579 ధరకే అందుబాటులో ఉన్నాయి. రూ.600 లోపు బడ్జెట్‌లో ఇంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న గ్యాజెట్ దొరకడం నిజంగా బెస్ట్ అనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్, పవర్‌ఫుల్ సౌండ్, బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి హామర్ ఎయిర్‌ఫ్లో నియో ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు కూడా తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే.. ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది.

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×