Discretion App : మనం స్మార్ట్ ఫోన్ ఏదైనా ఫొటో తీసినప్పుడు లేదా దిగినప్పుడు, జీపీఎస్ లేదా ఫోన్లో ఉన్న ఫీచర్స్ ద్వారా ఇమేజ్‌తో పాటు ఫొటో తీసిన తేదీ, సమయం, లొకేషన్, కెమెరా మోడల్, లెన్స్ రకం, కెమెరా సెటింగ్స్, ఇమేజ్ రెజల్యూషన్, పిక్సెల్ డైమెన్షన్, సైజు వంటి పలు మెటా డేటా వివరాలు సేవ్ అయిపోతుంటాయి. అయితే మనం ఏదైనా ఫొటోను పబ్లిక్ వెబ్‌లో షేర్ చేసినప్పుడు, గోప్యత కోసం ఆ ఇమేజ్‌కు సంబంధించిన లొకేషన్ సమాచారం లేదా అందులోని ముఖాన్ని లేదా ముఖాలను కనపడకుండా, షేర్ చేయాలని అనుకుంటుంటాం. ఒకవేళ ఆ పిక్‌లో మన చిన్న పిల్లల ఉంటే వారి ముఖాలను కనపడకుండా దాయాలనుకుంటాం.
కానీ ఆన్లైన్లో ఫొటో లేదా ఇమేజ్ను పోస్ట్ చేసినప్పుడు ఈ పిక్‌ను ఇతరులకు షేర్ చేయొద్దు అని చెప్పలేం. ఒకవేళ చెప్పిన కూడా అది విసృత్త స్థాయిలో షేర్ అయిపోతుంది. దీని వల్ల మన ప్రైవసీ దెబ్బతింటుంది. అప్పటికీ మనం ముఖాలను కనపడకుండా ఉండేందుకు ఎమోజీలతో కవర్ చేసి షేర్ చేస్తుంటాం. కానీ ముఖాల వరకు కనపడకపోయినా.. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, మనతో పాటు ఎవరెవరు ఉన్నారు సహా ఫొటోకు సంబంధించిన ఇతర మెటా డేటా వంటి సమాచారం బయటకు తెలిసిపోతుంటాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఇప్పటికే అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో కూడిన ఎన్నో ఫీచర్స్ వచ్చాయి. అయినప్పటికీ కొన్ని సార్లు మన ప్రైవసీకి భంగం కలుగుతూనే ఉంటుంది. అయితే ఓ యాప్ వల్ల మన ప్రైవసీని కాపాడుకునేలా చేసుకోవచ్చు. దాని పేరే డిస్క్రీషన్. ఈ ఇండీ యాప్ మ్యాక్, ఐఓఎస్ వారికి అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఫొటోస్‌లోని ఫేస్‌లను, ఫొటోలకు సంబంధించిన మేటా డేటా సమాచారాన్ని హైడ్ చేయొచ్చు.
సింగిల్ స్టెప్‌లో ముఖాలను హైడ్ – ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సింపుల్. సింపుల్‌గా యాప్‌ను ఓపెన్ చేసి అందులో ఏదైనా ఫొటోను యాడ్ చేయాలి. అందులో ఫొటోస్‌లోని ముఖాలన్నీ కవర్ అయి కనిపిస్తాయి. గ్రే కలర్ సర్కిల్‌తో కవర్ అయి కనిపిస్తాయి. అంటే ముఖాలు కనపడవు అన్న మాట. డిఫాల్ట్‌గా అయిన ఈ ఫిల్టర్‌ను మీకు నచ్చినట్టుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. గ్రే కలర్‌కు బదులుగా మీకు నచ్చిన రంగు లేదా పెయిడ్ వెర్షన్స్‌లో అయితే ఎమోజీలను కూడా జోడించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫొటోస్‌లోని ప్రతి వ్యక్తికి ఓ డిఫరెంట్ కలర్ లేదా డిఫరెంట్ ఎమోజీని జోడించుకోవచ్చు. అలానే ముఖాలను కవర్ చేసే సర్కిల్ సైజెస్ను మార్చుకోవచ్చు.
ALSO READ : తక్కువ ధరకే ఎన్ని ఫీచర్సో.. ఈ స్మార్ట్ వాచెస్ పై మీరు ఓ లుక్కెయ్యాల్సిందే!
ఫొటో మెటాడేటా తొలిగింపు – ఈ యాప్‌లో మరో పెద్ద ఫీచర్ ఏంటంటే మెటాడేటాను తొలిగించడం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఏదైనా ఫొటో తీసినప్పుడు లేదా దిగినప్పుడు, జీపీఎస్ లేదా ఫోన్లో ఉన్న ఫీచర్స్ ద్వారా ఇమేజ్‌తో పాటు ఫొటో తీసిన తేదీ, సమయం, లొకేషన్, కెమెరా మోడల్, లెన్స్ రకం, కెమెరా సెటింగ్స్, ఇమేజ్ రెజల్యూషన్, పిక్సెల్ డైమెన్షన్, సైజు వంటి పలు మెటా డేటా వివరాలు సేవ్ అయిపోతుంటాయి. అయితే ఈ డిస్క్రీషన్ యాప్ ద్వారా ఫొటోకు సంబంధించిన అన్నీ స్ట్రిప్స్‌ను తొలిగించవచ్చు.
ఉదాహరణకు ఓ ఫొటోకు సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్లినప్పుడు లాస్ట్ ఓపెన్డ్, డైమెన్షన్స్, డివైస్ మేక్, డివైస్ మోడల్, కలర్ స్పేస్, కలర్ ప్రొఫైల్, ఫోకల్ లెంగ్త్, అల్ఫా ఛానల్, రెడ్ ఐ, మీటరింగ్ మోడ్, ఎఫ్ నెంబర్, ఎక్స్పోజర్ ప్రోగ్రామ్, ఎక్స్పోజర్ టైమ్, ల్యాటిట్యూడ్, లాంగిట్యూడ్ సహా పలు ఇతర సమాచారం కనిపిస్తుంది. కానీ ఈ డిస్క్రీషన్ ఫీచర్ ద్వారా డివైస్ మైక్, డివైస్ మోడల్ సహా ఇతర ముఖ్యమైన మెటా డేటా సమాచారాన్ని చూపించదు. అన్నింటినీ హైడ్ చేస్తుంది. దీంతో ఇతరులు ఎవరూ ఈ సమాచారాన్ని చూడలేరు.
మొత్తంగా ఈ డిస్క్రీషన్ ఫ్రీ వెర్షన్ అద్భుతంగా పని చేస్తుంది. అలాగే పెయిడ్ వెర్షన్ అయితే బ్యాచ్ ప్రాసెసింగ్, ఎమోజీ ఫిల్టర్స్ సహా మరిన్ని మెరుగైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏడాదికి 1.99 డాలర్లు, అదే లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ అయితే 4.99 డాలర్లు.