DJI Mic Mini 2S : యూట్యూబ్ రీల్స్, వ్లాగ్స్ లేదా పాడ్‌కాస్ట్‌లు చేసే క్రియేటర్స్‌కు ఆడియో క్వాలిటీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే.. ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ DJI, మార్కెట్లోకి సరికొత్త DJI Mic Mini 2S వైర్‌లెస్ మైక్‌ను లాంచ్ చేసింది. అల్ట్రా లైట్‌వెయిట్ డిజైన్‌తో పాటు ఇందులో .. క్రేజీ 32-Bit Float Recording, AI Noise Cancellation ఫీచర్లను అందించారు. క్రియేటర్స్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మార్చేయడానికి వచ్చిన ఈ సరికొత్త మైక్ ఫీచర్స్, ధరల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో కంటెంట్ క్రియేషన్‌లో వీడియో ఎంత బాగున్నా, బ్యాక్‌గ్రౌండ్ లో డిస్టర్బెన్స్ వస్తే.. ఆడియన్స్‌కు బోర్ కొట్టేస్తుంది. రోడ్డు మీద షూట్ చేసేటప్పుడు వెహికల్స్ సౌండ్స్, విండ్ నాయిస్ పెద్ద తలనొప్పిగా మారుతాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. క్రియేటర్స్ ఇష్టపడే DJI బ్రాండ్, ఒక చిన్న సైజ్ ధమాకా లాంటి మైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే DJI Mic Mini 2S. దీని సైజ్ మినీనే కానీ.. ఇందులో ఉన్న ఫీచర్స్ మాత్రం మాస్ అని చెప్పాలి.
ఈ సరికొత్త DJI Mic Mini 2S ట్రాన్స్‌మిటర్ కేవలం 12 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. టీషర్ట్ లేదా కాలర్‌కు పెట్టుకుంటే అస్సలు బరువు అనిపించదు.పైగా కెమెరా ముందు చాలా చిన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని లుక్‌ను మార్చుకోవడానికి కలర్‌ఫుల్ మాగ్నెటిక్ కవర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ మైక్‌లో క్రియేటర్స్‌కు దొరికిన బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్ 32-Bit Float Onboard Recording. దీని వల్ల లాభం ఏంటంటే.. మీరు సడన్‌గా గట్టిగా అరిచినా లేదా చాలా నిశ్శబ్దంగా గుసగుసలాడినా సరే, ఆడియో ఎక్కడా డిస్టార్షన్ (క్రాక్) అవ్వకుండా క్రిస్టల్ క్లియర్‌గా రికార్డ్ అవుతుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆడియోను అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది సూపర్బ్‌గా హెల్ప్ అవుతుంది. ఇందులో.. 14.5GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇచ్చారు, అంటే దాదాపు 28 గంటల ఆడియోను మైక్‌లోనే సేవ్ చేసుకోవచ్చు.
ఈ మైక్‌లో అందించిన AI-backed Noise Reduction టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మీరు ఎంత రద్దీగా ఉండే రోడ్డు పైన లేదా విపరీతమైన గాలి వచ్చే బీచ్‌లో షూట్ చేస్తున్నా.. ఈ AI ఫీచర్ వెనకాల వచ్చే అనవసరమైన శబ్దాలన్నింటినీ ఫిల్టర్ చేసి, కేవలం మీ వాయిస్‌ను మాత్రమే క్లియర్‌గా హైలైట్ చేస్తుంది. ఇందులో రెగ్యులర్, రిచ్, బ్రైట్ అని మూడు రకాల వాయిస్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి.
ఈ మైక్ సిస్టమ్‌లో ఒకే రీసీవర్‌కు ఏకంగా 4 ట్రాన్స్‌మిటర్లను (మైకులను) ఒకే సారి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే నలుగురు కలిసి పాడ్‌కాస్ట్ లేదా ఇంటర్వ్యూలు ఈజీగా చేసుకోవచ్చన్నమాట. DJI Osmo Pocket 4, Osmo Action 6 వంటి కెమెరాలకు అయితే రీసీవర్ కూడా అవసరం లేకుండా నేరుగా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది.
రేంజ్: ఓపెన్ ప్లేస్‌లో ఏకంగా 400 మీటర్ల దూరం వరకు ఆడియో సిగ్నల్ కట్ అవ్వకుండా రికార్డ్ అవుతుంది.
బ్యాటరీ: ఛార్జింగ్ కేస్‌తో కలిపి వాడితే.. ఈ మైక్ సిస్టమ్ ఏకంగా 40 గంటల పాటు నాన్-స్టాప్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
DJI Mic Mini 2S వేర్వేరు కాంబో ప్యాక్స్‌లో లభిస్తోంది. దీని గ్లోబల్ ధరల ఆధారంగా అంచనా వేసిన ఇండియన్ ప్రైస్ వివరాలు..
Also Read: రూ.738కే పైసా వసూల్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్స్ బలాదూర్ !
సింగిల్ ట్రాన్స్‌మిటర్ + రీసీవర్ బండిల్- రూ. 9,000
స్టాండర్డ్ కిట్ (2 మైకులు + 1 రీసీవర్ + ఛార్జింగ్ కేస్) రూ. 15,800
ప్రీమియం కాంబో (2 మైకులు + రీసీవర్ + కేస్ + మొబైల్ రీసీవర్) రూ. 17,100
రీల్స్ మేకర్స్, వ్లాగర్స్ , ప్రొఫెషనల్ వీడియోస్ చేసే వారికి DJI Mic Mini 2S ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. తక్కువ బరువు, గట్టి బ్యాటరీ, ఏఐ పవర్‌తో వచ్చే ఈ మైక్ కచ్చితంగా మీ కంటెంట్ క్వాలిటీని మార్చేస్తుంది.