E-Paper
Advertisement

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మోసపోతున్నారా? నిజమైన డిస్కౌంట్ కనిపెట్టండిలా!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మోసపోతున్నారా? నిజమైన డిస్కౌంట్ కనిపెట్టండిలా!
Advertisement

Amazon Flipkart fake discount scam: పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సైట్లు ‘భారీ డిస్కౌంట్లు’, ‘బంపర్ ఆఫర్లు’ అంటూ మన ముందుకు వచ్చేస్తాయి. 80% ఆఫ్, 50% ఆఫ్ అనగానే.. మనం కూడా లాభం అనుకుని ఎగబడి కొనేస్తుంటాం. కానీ.. మీరు చూస్తున్న ఆ డిస్కౌంట్ నిజమేనా? లేక సేల్స్ పెంచడానికి కంపెనీలు ఆడే మైండ్ గేమా? ఈ హాట్ టాపిక్ గురించి, ఫేక్ ఆఫర్ల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

మీరు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా మోసపోతున్నారా?

Advertisement

ఈ రోజుల్లో బట్టల నుంచి మొబైల్స్ వరకు అంతా ఆన్‌లైన్ షాపింగే. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లాంటివి వస్తే.. క్రెడిట్ కార్డులు బయటకు తీసి షాపింగ్ జాతర మొదలుపెడతాం. అయితే.. చాలా సందర్భాలలో ఈ సేల్స్ లో మనం లాభపడుతున్నాం అనుకుంటాం కానీ… నిజానికి మోసపోతుంటాం. అసలు వారి ట్రిక్స్ ఏంటంటే..

ఫేక్ డిస్కౌంట్ మైండ్ గేమ్:

చాలా కంపెనీలు సేల్స్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు ప్రోడక్ట్ ధరను భారీగా పెంచేస్తాయి. ఉదాహరణకు ఒక ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.2,000 అనుకుందాం. సేల్ కి వారం ముందు దాని ధరను వెబ్‌సైట్‌లో రూ.4,000 అని చూపిస్తారు. సేల్ రోజున “భారీ ఆఫర్.. 50% డిస్కౌంట్” అంటూ మళ్ళీ రూ.2,000 కే అమ్ముతారు. మనం రూ.2,000 ఆదా అయింది కదా అని సంబరపడతాం. కానీ నిజానికి అక్కడ రూపాయి.. కూడా తగ్గలేదు!దీన్నే ‘ఫేక్ ప్రైస్ హైక్’ అంటారు.

Advertisement

నిజమైన డిస్కౌంట్లను కనిపెట్టడం ఎలా?

యూజర్లకు ఉపయోగపడే నిజమైన సమాచారాన్ని.. అందించమంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో.. స్మార్ట్‌గా మారడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టూల్స్ ఉన్నాయి. వాటి ద్వారా సదరు ప్రోడక్ట్ గత ఆరు నెలల్లో అత్యంత తక్కువ ధరకు ఎప్పుడు అమ్ముడైందో ఈజీగా తెలుసుకోవచ్చు.

కీపా: మీరు ఎక్కువగా అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ‘Keepa’ అనేది ఒక వరం లాంటిది. ఇది ఒక వెబ్‌సైట్, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. మీరు కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ లింక్‌ను ఇందులో పేస్ట్ చేస్తే.. గత కొన్ని నెలలుగా దాని ధర ఎలా పెరిగింది, తగ్గింది అనేది ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది.

ప్రైస్ బిఫోర్ లేదా ప్రైస్ ట్రాకర్స్: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండింటికీ ఉపయోగపడే వెబ్‌సైట్లు ఇవి. ఇక్కడ మొబైల్ లేదా టీవీ లింక్ ఇస్తే.. ఆ ప్రోడక్ట్ యొక్క అల్టిమేట్ ‘లోయెస్ట్ ప్రైస్’ ఎంతో తెలిసిపోతుంది. ఒక వేళ సేల్ రోజున చూపిస్తున్న ధర కంటే.. గతంలో ఇంకా తక్కువ ధర ఉంటే, అది ఫేక్ ఆఫర్ అని మీరు ఈజీగా డిసైడ్ అవ్వొచ్చు.

స్మార్ట్ షాపింగ్ కోసం కొన్ని క్రేజీ టిప్స్:

విష్‌లిస్ట్ క్రియేట్ చేయండి: సేల్స్ రాకముందే.. మీకు కావాల్సిన వస్తువులను విష్‌లిస్ట్‌లో పెట్టుకుని.. వాటి సాధారణ ధరలను నోట్ చేసుకోండి. సేల్ రోజున నిజంగా ధర తగ్గిందో లేదో క్రాస్ చెక్ చేయండి.

కార్డ్ ఆఫర్లు & కూపన్లు: కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లు, వెబ్‌సైట్ లో కింద ఇచ్చే చిన్న ‘కూపన్ బాక్స్’లను టిక్ చేయడం మర్చిపోకండి. ఇవి అదనపు డిస్కౌంట్ ఇస్తాయి.

సెల్లర్ రేటింగ్స్ చూడండి: తక్కువ ధరకే వస్తుంది కదా అని ఏ సెల్లర్ పడితే ఆ సెల్లర్ దగ్గర కొనకండి. నకిలీ ప్రోడక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనీసం 4 స్టార్ రేటింగ్ ఉన్న సెల్లర్స్ నే ఎంచుకోండి.

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×