Big Stories

Alzheimer’s:- అల్జీమర్స్‌కు కొత్త మందు.. ఒక టాబ్లెట్‌తో..

Alzheimer’s:- ఎన్నో ఏళ్లుగా మనుషులను పీడిస్తున్న క్లిష్టమైన మానసిక వ్యాధి ఏంటి అని అడిగితే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అల్జీమర్స్. ఈ వ్యాధి గురించి ఎన్నో ఏళ్లుగా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, దీనిని చికిత్సతో పూర్తిగా నయం చేసే అవకాశం లేదా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా వారు ఒక కొత్త సమాధానంతో ముందుకొచ్చారు.

- Advertisement -

అల్జీమర్స్ వ్యాధి ప్రభావాన్ని తగ్గించడం కోసం డోనానెమాబ్ అనే మందును కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే అల్జీమర్స్ ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. దానిని మరింత మెరుగ్గా డోనానెమాబ్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. రోజూవారి జీవితంలో కూడా మనిషి ఏ పని చేయలేని విధంగా అల్జీమర్స్.. వారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మెల్లగా వారి మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తుంది.

- Advertisement -

మూడు రెట్లు అల్జీమర్స్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడానికి డోనానెమాబ్ ఉపయోగపడుతుందని ఈ మందును తయారు చేసిన ఎలీ లిల్లీ సంస్థ వెల్లడించింది. గతేడాది నుండి ఇది మెల్లగా మార్కెట్లోకి అందుబాటులోకి రావడం మొదలయ్యింది. ఇప్పటికే లెకెంబీ అనే మందు దీనికోసం అందుబాటులో ఉందని, దాదాపుగా దాని పద్ధతిలోనే డోనానెమాబ్ కూడా పనిచేస్తుందని ఎలీ లిల్లీ ప్రకటించింది. అసలు చికిత్సే లేకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న అల్జీమర్స్ లాంటి వ్యాధికి లెకెంబీ, డోనానెమాబ్ లాంటి మందులు యాంటీబాడీలుగా పనిచేస్తాయని తెలిపింది.

మామూలు యాంటీబాటీస్ అనేవి వైరస్‌లను వేరే విధంగా డీల్ చేస్తాయని, కానీ ఈ మందులు మాత్రం వ్యాధిని కేవలం వ్యాప్తి చెందకుండా ఆపడానికే పనిచేస్తాయని తెలుస్తోంది. అల్జీమర్స్ వల్ల మెదడులో ఏర్పడే బెటా అమిలాయిడ్ అనే జంక్‌ను తొలగించడం కోసం ఈ మందులు ఉపయోగపడతాయి. టెక్నాలజీ పెరుగుతూ ఉండడంతో అల్జీమర్స్‌పై జరుగుతున్న పరిశోధనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అందుకే త్వరలోనే కేవలం ఒక మందుతో అల్జీమర్స్ రాకుండా ఉండేలా టెక్నాలజీ అభివద్ధి చెందితే బాగుండేదని పలువురు వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News