Elon Musk’s X : ఎక్స్ లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ఈ ఫీచర్.. వినియోగదారులు లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతాకు తక్షణమే డబ్బును బదిలీ చేయడంతో పాటు P2P చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది.
ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X… వీసా అందించే డిజిటల్ వాలెట్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అదనంగా, కంపెనీ తన ప్లాట్‌ఫారమ్‌లో P2P సేవలను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల్లో విశ్వసనీయ కంపెనీతో.. వీసా చెల్లింపులకు తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ డిజిటల్ చెల్లింపు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని.. డిజిటల్ చెల్లింపుల్లో మెుదటిసారి ఎక్స్ చెల్లింపులు చేపట్టబోతుందని వెల్లడించింది.
X Corp CEO లిండా ఎకారినో (Linda Yaccarino) తమ డిజిటల్ చెల్లింపుల భాగస్వామ్యంపై ఎక్స్ వేదికగా స్పందించారు. “ఎవ్రీథింగ్ యాప్‌కి ఈ విషయం మరో మైలురాయి. Money ఖాతా కోసం Visa మా మొదటి వ్యాపార పార్టనర్. ఇది ఈ సంవత్సరం చివరలో యూజర్స్ కు అందుబాటులోకి వస్తుంది..” అంటూ తెలిపారు.
ఈ ఫీచర్ వినియోగదారులు తాము కనెక్ట్ చేసుకున్న బ్యాంక్ ఖాతాకు తక్షణమే డబ్బును బదిలీ చేయడంతో పాటు P2P చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది. 41 US రాష్ట్రాల్లో మనీ ట్రాన్స్‌మీటర్ లైసెన్స్‌ల కోసం ఈ సేవలు రాబోతున్నాయి. నివేదిక ప్రకారం, కంపెనీ వీసా డైరెక్ట్‌ను భాగస్వామిగా చేసుకుంటుంది. ఇది వీసా రియల్ టైమ్ మనీ ట్రాన్స్ఫర్ సమస్యలకు చక్కటి పరిష్కారంగా మారబోతోందని ఆ కంపెనీ అభిప్రాయపడుతుంది. వినియోగదారడి డెబిట్ కార్డ్‌కు లింక్ చేయబడే X మనీ వాలెట్‌తో పనిచేస్తుంది. ఇక ఈ సదుపాయంతో వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలో తక్షణమే డబ్బును బదిలీ చేయగలుగుతారని కూడా ఎక్స్ ప్రతినిధులు తమ పోస్ట్ లో పేర్కొన్నారు.
Another milestone for the Everything App: @Visa is our first partner for the @XMoney Account, which will debut later this year.
💰Allows for secure + instant funding to your X Wallet via Visa Direct
🪪 Connects to your debit card allowing P2P payments
🏦 Option to instantly…
— Linda Yaccarino (@lindayaX) January 28, 2025
X డిజిటల్ వాలెట్ సేవలో ప్రవేశించడం ఆ కంపెనీ వృద్ధిని గణనీయంగా పెంచుతుందని భావిస్తుంది. అదనంగా, ervice సంస్థ పర్యావరణ వ్యవస్థను విస్తరిస్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న fintect మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. X కోసం డిజిటల్ చెల్లింపు వ్యూహం సంస్థ ఆదాయ వ్యవస్థను మెరుగుపరచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాని ప్లాట్‌ఫారమ్‌పై మరింత మంది వినియోగదారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో పెను మార్పులు రాబోతున్నాయని.. వాస్తవానికి చైనా WeChat లాగా Xను అన్ని సేవలు అందించే యాప్‌గా మార్చాలనే ఆలోచనతో ఎలన్ మస్క్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది
ఇక ఎక్స్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ లో మరింత మెరుగైన పరిస్థితి కనిపించనున్నట్టు.. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడేట్టు ఎక్స్ భావిస్తుంది. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా జరిగే కమ్యూనికేషన్స్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని భావిస్తుంది. వినియోగదారుల కోసం చెల్లింపు వ్యవస్థను ఆర్థికలావాదేవిలను మరింత సురక్షితంగా అందించేందుకు ఎక్స్ తన ప్రయత్నాలు ముందు ముందు మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : యూఎస్ ప్రభుత్వం కోసం స్పెషల్ చాట్‌జీపీటీ.. ఏ ఏ పనులు చేస్తుందంటే!