BigTV English

Devara 2 Update: ఊహకు మించిన భారీ యాక్షన్ సీక్వెన్స్.. థియేటర్లు బద్దలవడం ఖాయం..!

Devara 2 Update: ఊహకు మించిన భారీ యాక్షన్ సీక్వెన్స్.. థియేటర్లు బద్దలవడం ఖాయం..!

Devara 2 Update: దేవర -2(Devara-2).. ప్రస్తుతం నందమూరి అభిమానులు తమ హీరోల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఈ సినిమా కూడా ఒకటి. ‘దేవర పార్ట్ 1’ గత ఏడాది వచ్చి సైలెంట్ గా రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. అయితే కొరటాల శివ (Koratala siva) డైరెక్షన్ ఎక్కడో మిస్ అయింది అని, ఆచార్య సినిమా(Acharya Movie) ఎఫెక్ట్ దీనిపై పడిందని కొంతమంది కామెంట్లు చేశారు. కానీ సినిమా మాత్రం ఎట్టకేలకు హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది అని మేకర్స్ ముందే ప్రకటించేశారు.ఇక పార్ట్ 1 కంటే పార్ట్ 2 అద్భుతంగా ఉంటుందని, దేవర పార్ట్ 2 లోనే కథ మొత్తం ఉంది అని సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం కొరటాల శివ అల్లు అర్జున్(Koratala Siva- Allu Arjun) తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే.. దేవర-2 స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట కొరటాల శివ.


దేవర 2 కోసం భారీ ప్లాన్..

ఇప్పటికే ఆ సినిమాను ఎలా తెరకెక్కించాలి..? ఎప్పుడు తెరకెక్కించాలి..? అవుట్ పుట్ ఎలా ఉంటే అభిమానులు సినిమా చూస్తారు? అనే ఆలోచనలో పడ్డారట కొరటాల శివ. అయితే నందమూరి అభిమానులని సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా అందులో యాక్షన్స్ సన్నివేశాలు ఉండాలి. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. దేవర పార్ట్ 2 లో పుష్ప 2(Pushpa-2) ని మించిన యాక్షన్ సన్నివేశాలు,ట్విస్టులు ఉండేలా చూసుకుంటున్నారట డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటికే దేవర పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్టులో ఇవన్నీ ఉండేలా రాసుకుంటున్నారట. పుష్ప 2 ఎలా అయితే భారీ హిట్టు కొట్టిందో.. దేవర 2 విషయంలో కూడా పుష్ప2 సినిమా మాదిరే తీయాలి అని కొరటాల శివ(Koratala Siva)ప్లాన్ చేస్తున్నారట.


భారీ యాక్షన్స్ సన్నివేశాలతో..

ఇప్పటికే దేవర పార్ట్ 2 కి అనుకున్న కథలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసి మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నారట. పుష్ప-2 సినిమా చూశాక అభిమానులు ఎలా అయితే ఆశ్చర్యపోయారో అలాగే దేవర పార్ట్ 2 ని చూసి కూడా అభిమానులు సర్ప్రైజ్ అయ్యే విధంగా కొరటాల శివ స్క్రిప్ట్ రాసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక నందమూరి అభిమానులను మెప్పించే భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) తో కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవర 2పై రోజు రోజుకి అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో పార్ట్ 2 లో యాక్షన్ సన్నివేశాలు, ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి అని సినీ వర్గాలు వెల్లడించడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. మరి చూడాలి దేవర-2 అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో.. అలాగే దేవర -2 లో దేవర-1 లో చేసినట్టుగా కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే దేవర 2 (Devara-2)లో హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×