OpenAI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సేవలను మరింత మెరుగుపరచటానికి అమెరికా ప్రభుత్వం కోసం OpenAI స్పెషల్ చాట్ జీపీటీను ప్రారంభించింది. ఈ ChatGPT ప్రభుత్వ కార్యాలయాల్లో సంభాషణను సేవ్ చేస్తుందని.. ప్రతీ పనిలో భాగస్వామ్యం అవుతుందని.. ఫోటోలను, టెక్ట్ ను సైత అప్‌లోడ్ చేయగలదని తెలుస్తుంది. మరి ఇక ఈ స్పెషల్ చాట్ జీపీటీ ఇంకే పనులు చేస్తుందో చూద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదలతో టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ అనేది ఇండస్ట్రీలో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా కమ్యూనికేషన్ ను సైతం మెరుగుపరుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఏఐ ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా ప్రభుత్వం కోసం స్పెషల్ చాట్ జీపీటీను ప్రవేశపట్టింది ఆ సంస్థ. ఈ విషయాన్ని తన బ్లాగ్ లో వెల్లడించింది.
“గవర్నమెంట్ కోసం చాట్ జీపీటీను ప్రకటిస్తున్నాము. ఇది యూఎస్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఓపెన్ ఏఐ సేవలను మరింతగా మెరుగుపరుస్తుంది. సమాచారాన్ని మరింతగా యాక్సిస్ చేయడానికి, కొత్త విషయాలను అన్వేషించడానికి ఈ చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది..” అంటూ బ్లాగ్ లో రాసుకొచ్చింది.
అంతేకాకుండా US ప్రభుత్వం కార్యకలాపాల కోసం ChatGPTను ఎలా ఉపయోగించవచ్చో ఓపెన్ ఏఐ మరింత విసృతంగా తెలిపింది. “ప్రభుత్వ ఏజెన్సీలు వారి సొంత Microsoft Azure వాణిజ్య క్లౌడ్ లేదా Azure ప్రభుత్వ క్లౌడ్‌లో ChatGPTని అమలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో US ప్రభుత్వ భద్రత కోసం ChatGPT మరిన్ని సేవలను తీసుకొచ్చింది.. భద్రత, పర్మిషన్స్, డేటా సెక్యూరిటీతో పాటు మరిన్ని విషయాలలో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అదనంగా, AI చాట్‌బాట్ పబ్లిక్ కాని సున్నితమైన డేటాను కూడా నిర్వహిస్తూ గోప్యంగా ఉంచుతుంది. IL5, CJIS, ITAR, FedRAMP హైతో సహా కఠినమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ల కోసం ChatGPT పని చేస్తుంది…” అని తెలిపింది
ChatGPT Features –
అమెరికా ప్రభుత్వం కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ చాట్ జీపీటీ.. ఎన్నో మెరుగైన సేవలను అందిస్తుంది. ముఖ్యంలో చాట్ జీపీటీ ఎంటర్‌ప్రైజ్ వంటి స్పెషల్ ఫీచర్స్ తో సైతం సమర్థవంతంగా పనిచేస్తుంది.
ChatGPT ప్రభుత్వం వారి ప్రభుత్వ కార్యాలయాల్లో సంభాషణను సేవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫోటోలను, టెక్ట్ ను సైతం అప్‌లోడ్ చేయగలదు.
ప్రభుత్వం ChatGPT ప్రీమియం వెర్షన్, ChatGPT 4oను తీసుకుంటే… అది ఏజెన్సీల కోసం మ్యాథ్స్ ఆపరేటింగ్స్ ను సైతం సమర్థవంతంగా చేయగలుగుతుంది. కోడింగ్, మ్యాథ్స్ ఆపరేటింగ్ ను తేలికగా చేస్తుంది.
CIO, IT బృందాల కోసం వినియోగదారులతో పాటు టీమ్ మెంబర్స్, అందుబాటులో ఉన్న GPTలు… సింగిల్ సైన్-ఆన్ (SSO)తో మరింత సమాచారాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.
తాజాగా చైనా ప్రభుత్వం డీప్ సీక్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో చాట్ జీపీటీ మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేపట్టిందని… అందుకే ప్రత్యేక చాట్ జీపీటీను తీసుకొచ్చిందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి కొత్త చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే
ALSO READ : యూఎస్ ప్రభుత్వం కోసం స్పెషల్ చాట్‌జీపీటీ.. ఏ ఏ పనులు చేస్తుందంటే!