BigTV English

Vishwambhara : ఇంకా పెండింగ్ లోనే ‘విశ్వంభర’ ఓటీటీ డీల్…. డైలమాలో రిలీజ్ డేట్

Vishwambhara : ఇంకా పెండింగ్ లోనే ‘విశ్వంభర’ ఓటీటీ డీల్…. డైలమాలో రిలీజ్ డేట్

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీ విషయంలో రోజుకో కొత్త సమస్య తలెత్తుతున్నట్టు ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పై మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారు అనే వార్తలు వినిపించాయి. ఇక మరోవైపు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడేమో ‘విశ్వంభర’ మూవీ ఓటీటీ డీల్ ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలుస్తోంది.


పెండింగ్లో ‘విశ్వంభర’ ఓటీటీ డీల్

మెగా అభిమానులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, త్రిష (Trisha) హీరోయిన్ గా, వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్విత వేముగంటి నండూరి వంటి హీరోయిన్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం.


తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ డీల్ కారణంగా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అయోమయంలో ఉన్నారని సమాచారం. ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూవీకి సంబంధించి ఒక దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. అయితే డీల్ క్లోజ్ కాకపోవడంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ 2025 క్యాలెండర్ రిలీజ్ చేయబోయే సినిమాలతో ఫుల్లుగా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకున్నాయి. అయినప్పటికీ ‘విశ్వంభర’ (Vishwambhara) ఓటీటీ రైట్స్ కోసం మేకర్స్ భారీ ధరకు డీల్ సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారని, అయితే ఓ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ మూవీ రైట్స్ కొనడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. కానీ ఈ డీల్ క్లోజ్ అయ్యాక రిలీజ్ డేట్ ను, అలాగే స్ట్రీమింగ్ డేట్ ను తామే నిర్ణయించాలి అనే ఆలోచనలో ఉన్న మేకర్స్ త్వరలో ఓ నిర్ణయానికి రాబోతున్నారట.

కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

ఇక ‘విశ్వంభర’ (Vishwambhara) ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడంతో మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా గందరగోళం నడుస్తోంది. ముందుగా ఈ మూవీని జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి అద్భుతమైన రిలీజ్ డేట్ ని తన వారసుడు రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం వదులుకున్నారు. అయినప్పటికీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ‘విశ్వంభర’ మూవీని మే 9న రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×