BigTV English

FASTag Scam: ఫాస్‌ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ

FASTag Scam: ఫాస్‌ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ

FASTag Scam| ఫాస్‌ట్యాగ్ పేరుతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రీ-లోడెడ్ సేవ. ఇది టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా హైవేలపై సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. రిజిస్టర్ చేయబడిన వాహనం, లింక్ చేయబడి, రీఛార్జ్ చేసినప్పుడు.. టోల్ రుసుము ఫాస్‌ట్యాగ్ వాలెట్ నుండి ఆటోమేటిక్ గా తీసివేయబడుతుంది. అయితే, ఫాస్‌ట్యాగ్ వినియోగదారులను కొందరు క్రిమినల్స్ షాకింగ్ విధానంలో దోచుకుంటున్నారు. వినియోగదారుల ఫాస్‌ట్యాగ్ ఖాతాల నుండి డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగలిస్తున్నారు.


కొత్త ఫాస్‌ట్యాగ్ మోసాలు
సైబర్ నేరగాళ్లు ఫాస్‌ట్యాగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ SMS, ఇమెయిల్ హెచ్చరికలను పంపుతున్నారు. ఈ మెసేజ్ లు, మీ ఫాస్‌ట్యాగ్ ఖాతా సస్పెండ్ చేయబడిందని లేదా KYC వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెబుతాయి. ఈ స్కామర్‌లు.. వినియోగదారులను ఒక లింక్‌పై క్లిక్ చేయమని సూచిస్తారు. దురదృష్టవశాత్తూ.. చాలా మంది ఈ లింక్‌లపై క్లిక్ చేస్తూ, స్కామర్‌లకు తమ ఫాస్‌ట్యాగ్ వాలెట్‌కు తక్షణ యాక్సెస్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ మెసేజ్ లు నిజమైనవిగా కనిపిస్తాయి. కానీ స్కామర్‌లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి, ఫాస్‌ట్యాగ్ వినియోగదారుల డబ్బును ఖాళీ చేయడానికి వీటిని రూపొందించారు.

అలాంటి వినియోగదారులకు ఎక్కువ ప్రమాదం?
ఫాస్‌ట్యాగ్ వాలెట్‌లో బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు మాత్రమే ప్రమాదంలో ఉన్నారు. తరచూ ప్రయాణించేవారు.. ఫాస్‌ట్యాగ్ ఖాతాలో ఎక్కువ బ్యాలెన్స్ ఉంచే వారిని హ్యాకర్లు సులభంగా టార్గెట్ చేస్తున్నారు.


యాన్యువల్ ఫాస్‌ట్యాగ్ పాస్ సురక్షితమా?
ఇటీవల ప్రభుత్వం ₹3,000కి యాన్యువల్ ఫాస్ట్ ‌ట్యాగ్ పాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాస్ 200 ట్రిప్‌లు లేదా 1 సంవత్సరం కాలానికి చెల్లుబాటు అవుతుంది, ఏది ముందు అయితే అది. ఈ పాస్ ఉన్నవారు వాలెట్ బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు, కాబట్టి దొంగలు జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతా నుండి డబ్బు దొంగిలించలేరు. కాబట్టి, మీరు యాన్యువల్ పాస్‌కు తీసుకుంటే.. మీరు మోసాల నుండి సురక్షితంగా ఉంటారు.

ఫాస్‌ట్యాగ్ మోసాల నుండి సురక్షితంగా ఉండటం ఎలా?

మీ ఫాస్‌ట్యాగ్ వాలెట్‌ను స్కామర్‌ల నుండి సురక్షితంగా ఉంచడానికి ఈ మార్గదర్శకాలు చాలా ముఖ్యం:

  1. మీ OTPలు, పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌లను ఎవరితోనూ, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లతో సహా, ఎప్పుడూ పంచుకోవద్దు.
  2. మీ ఫాస్‌ట్యాగ్ ఖాతాను అప్‌డేట్ చేయడానికి లేదా రీఛార్జ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ను మాత్రమే ఉపయోగించండి.
  3. SMS లేదా ఇమెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు లేదా అనుమాస్పదంగా కనిపించే ట్యాగ్‌ల నుండి ఏదైనా డౌన్‌లోడ్ చేయవద్దు.
  4. గుర్తు తెలియని లేదా ధృవీకరించని మూలం (ఐడి) నుండి వచ్చిన QR కోడ్‌ను ఎప్పుడూ స్కాన్ చేయవద్దు.
  5. మీ ఫాస్‌ట్యాగ్ ఖాతా బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
  6. మోసం జరిగిన వెంటనే మీ ఫాస్‌ట్యాగ్ ప్రొవైడర్‌కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయండి.

Also Read: ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లతో ఫాస్టాగ్ రీచార్జ్.. సులభంగా ఈ స్టెప్స్ పాటించండి

Related News

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Redmi 15 5G vs Poco M7 Plus 5G: బడ్జెట్ ధరలో రెండు సూపర్ ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలి?

ChatGpt Go: ఇండియాలో చాట్ జిపిటి గో విడుదల.. 10 రెట్లు ఎక్కువ లిమిట్, ఇమేజ్ జెనెరేషన్.. ఇంకా!

Oppo K13 Turbo Pro vs iQOO Z10 Turbo+: గేమింగ్ కోసం రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. ఏది బెస్ట్?

Rats And Flies: అంతరిక్షంలోకి 75 ఎలుకలను పంపుతోన్న రష్యా.. ఎందుకంటే?

Big Stories

×