BigTV English

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Credit Card Record| ఈ సంవత్సరం భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సేల్ రికార్డ్ సృష్టించింది. షాపింగ్‌తో పాటు డిజిటల్ చెల్లింపులు కూడా ఆకాశాన్ని తాకాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great India Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) ఆన్‌లైన్ షాపింగ్‌ను కొత్త లెవెల్స్‌కు తీసుకెళ్లాయి. సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డ్ ఖర్చు తొలిసారిగా రూ.1.2 లక్షల కోట్లు దాటింది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో క్రెడిట్ కార్డ్ సేల్ ఎన్నడూ లేదు.


క్రెడిట్ కార్డ్ షాపింగ్ రికార్డు
మనీకంట్రోల్ బిజినెస్ రిపోర్డ్ ప్రకారం.. సెప్టెంబర్ 22న ఒకే రోజు క్రెడిట్ కార్డ్ ఖర్చు 10,000 కోట్ల రూపాయలు దాటింది. నవరాత్రి ప్రారంభం, ఈ-కామర్స్ సేల్స్ జోరు, తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ మూడు ఒకే సమయంలో కావడంతో ఈ సారి షాపింగ్ చేయడానికి ప్రజలు రెట్టింపు ఉత్సాహం చూపారు. సెప్టెంబర్ 26 నాటికి ఖర్చు 1.03 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్ సేల్‌లో రూ.1.06 లక్షల కోట్లతో సమానం. నెలలో ఇంకా నాలుగు రోజులు ఉండగా.. ఈ సంఖ్య అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది.

తగ్గిన డెబిట్ కార్డ్, యూపీఐ సేల్
షాపింగ్ కొనుగోళ్లలో క్రెడిట్ కార్డ్‌లు ఆధిపత్యం చెలాయిస్తుండగా, డెబిట్ కార్డ్ వినియోగం తగ్గింది. సెప్టెంబర్‌లో డెబిట్ కార్డ్ ఖర్చు రూ.11,000 కోట్లకు పరిమితమైంది. గత అక్టోబర్‌లో ఇది రూ.14,300 కోట్లుగా ఉంది. క్రెడిట్ కార్డ్‌లపై ఆకర్షణీయ క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లు, ఈఎంఐ ఆఫర్‌లు దీనికి కారణం.


యూపీఐ లావాదేవీలు కూడా కొద్దిగా తగ్గాయి. రోజువారీ లావాదేవీలు 670 మిలియన్ నుండి 640 మిలియన్‌కు పడిపోయాయి. లావాదేవీ విలువ రూ.1 లక్ష కోట్ల నుండి రూ.80,000 కోట్లకు తగ్గింది. అయితే, నిపుణులు యూపీఐ ఆధిపత్యాన్ని ఈ తగ్గింపు ప్రభావితం చేయలేదని అభిప్రాయపడుతున్నారు.

క్రెడిట్ కార్డ్ ఉపయోగం ఎందుకు పెరిగింది?
ఈ-కామర్స్ సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లపై భారీ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందించాయి. ఫిన్‌టెక్ సంస్థలు రూపే-యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్‌లను కొత్త వినియోగదారులకు పరిచయం చేశాయి. ఈఎంఐ ఆప్షన్‌లు, ఆఫర్లు, ఖరీదైన కొనుగోళ్లకు వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌‌ ప్రయోజనాలు పొందడానికి ఎంచుకున్నారు. ఈ అంశాలు పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డ్ ఉపయోగాన్ని పెంచాయి.

క్రెడిట్ కార్డ్ ఉపయోగం పెరగడం వినియోగదారుల చెల్లింపు అలవాట్ల మార్పును సూచిస్తోంది. సౌలభ్యం, రివార్డ్‌లు, ఫ్లెక్సిబిలిటీ కోసం వారు క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకుంటున్నారు. పండుగ సేల్స్ షాపింగ్ ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేశాయనే చెప్పాలి. క్రెడిట్ కార్డ్‌ వినియోగంపెరగడం ఆర్థిక వ్యవస్థపై డిజిటల్ చెల్లింపుల ప్రభావాన్ని చూపుతున్నాయి.

Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Related News

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Big Stories

×