Noise icon 2 gen 2: ప్రస్తుత ట్రెండ్‌లో చేతికి వాచ్ అంటే.. కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఒక యాక్సెసరీగా మారి పోయింది. కానీ.. మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ అనగానే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఆ అపోహలను పటా పంచలు చేస్తూ నాయిస్ సంస్థ అత్యంత బడ్జెట్ ధరలో “నాయిస్ ఐకాన్ 2 జెన్ 2” ను మార్కెట్లోకి తెచ్చింది. తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ఈ వాచ్ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే సైజ్, డిజైన్ అని చెప్పాలి. ఇందులో పెద్దదైన 1.81 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల స్క్రీన్‌పై అక్షరాలు, నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్ దీనిలో ఉండటం వల్ల చేతికి పెట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం లుక్ వస్తుంది. డైలీ వాడకానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌లో కాలింగ్ ఫీచర్ ఉండటం ఈ వాచ్ ప్లస్ పాయింట్. దీనిలో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ఫోన్ జేబులో ఉన్నప్పటికీ.. వాచ్ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు, లిఫ్ట్ చేయెచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీసు పనిలో బిజీగా.. ఉన్నప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించడానికి మంచి బ్రైట్‌నెస్ అవసరం. నాయిస్ ఈ విషయంలో రాజీ పడ లేదు. ఇందులో 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల ఎండలో బయటికి వెళ్లినా స్క్రీన్ క్లియర్‌గా.. కనిపిస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) సెన్సార్, స్లీప్ ట్రాకర్ వంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రక రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఫిట్‌నెస్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి.
ఒక సారి చార్జ్ చేస్తే రోజంతా.. పని చేసే బ్యాటరీ బ్యాకప్ ఈ వాచ్ సొంతం. సాధారణ వాడకంలో.. ఈ వాచ్ బ్యాటరీ కొన్ని రోజుల పాటు ఈజీగా వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా.. లేదా చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ ద్వారా రోజూ కొత్త లుక్‌ను సెట్ చేసుకోవచ్చు.
Also Read: ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు బిల్లు టెన్షన్ లేదా?జొమాటో సరికొత్త ట్రిక్!
అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ నాయిస్ ఐకాన్ 2 జెన్ 2 స్మార్ట్‌వాచ్ ధర అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. మార్కెట్లో దీని అధికారిక ధర కేవలం రూ.1,299 మాత్రమే ఉంది. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు లభించడం నిజంగా టెక్ లవర్స్‌కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
మొత్తానికి.. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, పెద్ద డిస్‌ప్లే, కాలింగ్ ఫీచర్ కోరుకునే ప్రతి ఒక్కరికీ “నాయిస్ ఐకాన్ 2 జెన్ 2” అద్భుతమైన ఆఫ్షన్ అని చెప్పొచ్చు. మీరు గనక తక్కువ ధరలో మంచి స్మార్ట్ వాచ్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే.. నిస్సందేహంగా దీన్ని ఆర్డర్ చేయెచ్చు.