DC Movie: కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ రాజమౌళిగా ఈయనని భావిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు లోకేష్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలను సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా లోకేష్ కనకరాజు తెర వెనుక కాకుండా తెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా కూడా సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ వామికా గబ్బి హీరో హీరోయిన్లుగా అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “డీసీ”(DC Movie). ఈ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు ఏడవ తేది తెలుగు తమిళ భాషలలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా ద్వారా లోకేష్ వందకోట్ల క్లబ్ లో చేరారని తెలుస్తుంది. ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ రావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో నిర్మాత కళానిధి మారన్ (Kalanithi Maran)సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
సన్ పిక్చర్ బ్యానర్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చిన నేపథ్యంలో నిర్మాత కళానిధి మారన్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా దర్శకుడు అరుణ్ మాథేశ్వర్, హీరో లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ ముగ్గురికి ఊహించని విధంగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను (BMW Cars)బహుమతిగా అందించి సర్ప్రైజ్ చేశారు. స్వయంగా నిర్మాత కళానిధి మారన్ ఈ కారు తాళాలను ముగ్గురికి అందజేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI
— Sun Pictures (@sunpictures) September 10, 2026
ఇలా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ ముగ్గురికి బీఎండబ్ల్యూ కార్లను కానుకగా అందచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తలైవాసల్ విజయ్, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా, బాలాజీ దేవి శ్రీ ప్రసాద్ వంటి తదితరులు ఈ సినిమాల్లో కీలక పాత్రలలో నటించారు.
Also Read: యూట్యూబర్ నందనకు బిగ్ బాస్ క్రేజీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే ?