BigTV English

Flipkart Credit Card Offers 2024 : ఈ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా చౌకగా షాపింగ్ చేసేయొచ్చు.. ఇలా చెయ్యండి చాలు

Flipkart Credit Card Offers 2024 : ఈ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా చౌకగా షాపింగ్ చేసేయొచ్చు.. ఇలా చెయ్యండి చాలు

Flipkart Credit Card Offers 2024 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సేల్ లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫుట్ వేర్ తో పాటు అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది ఆ సంస్థ. కొనుగోళ్లపై భారీ తగ్గింపును ప్రకటించటంతో పాటు కొన్ని బ్యాంక్ కార్డ్స్ ఉన్న హోల్డర్స్ కు ప్రత్యేక డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ కార్డులతో షాపింగ్ చేస్తే అదనపు డిస్కౌంట్ తో పాటూ నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం సైతం ఉంటుందని ప్రకటించింది.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఎన్నో ఆఫర్స్ తో బిగ్ బిలియన్ సేల్ 2024ను స్టార్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ కు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమైన ఈ సేల్… మరుసటి రోజు నుంచి సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 6 రాత్రి 11:59 వరకూ అందుబాటులో ఉండనున్న ఈ డీల్స్ లో భారీ తగ్గింపులతో పాటూ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్స్ ను సైతం ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఎప్పటిలాగే HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేక డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కార్డ్ తో షాపింగ్ చేసే కస్టమర్లకు అదనపు తగ్గింపుతో పాటు నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది.

HDFC బ్యాంక్ కార్డ్ బెనిఫిట్స్ – సేల్ లో HDFC క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసే కస్టమర్లకు 10% ఇనిస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈజీ ఈఎమ్ఐ సదుపాయంతో పాటూ నో కాస్ట్ ఈఎమ్ఐ అందుబాటులో ఉండనుంది. దీనితో సులభ వాయిదా పద్ధతుల్లో నచ్చినవి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.


ఈ సదుపాయం కొన్ని HDFC క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కు మాత్రమే ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. HDFC క్రెడిట్ కార్డ్ తో పాటు డెబిట్ కార్డ్ హోల్డర్స్ కు ఉన్న షాపింగ్ అవకాశం…. HDFC బ్యాంక్ కమర్షియల్, కార్పొరేట్ కస్టమర్లకు లేదని తెలిపింది. దీనితో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపిఐ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు వర్తించదని స్పష్టం చేసింది.

ALSO READ : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో కళ్లు చెదిరే ఆఫర్​ – గూగుల్ పిక్సల్​ 8 మరీ ఇంత తక్కువ ధరకా?

కార్డ్ లిమిట్ డీటెయిల్స్ – గరిష్టంగా రూ.1750 వరకూ కస్టమర్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఒక కార్డుపై ఎన్ని కొనుగోళ్లు అయినా చేయెుచ్చని… ఈఎమ్ఐ, నాన్ ఈఎమ్ఐ, డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ, నో స్వైప్ ఈఎమ్ఐలపై సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

ఇక ఆపిల్, సామ్ సాంగ్ ఐటమ్స్ కొనుగోలు చేసే సమయంలోనే HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఇనిస్టెంట్ డిస్కౌంట్ ను పొందొచ్చు. సెలెక్టెడ్ బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్, గేమింగ్ పీసీలపై రూ. 50,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉండగా.. హై క్వాలిటీ ల్యాప్‌టాప్స్ పై 40% వరకు తగ్గింపు పొందొచ్చు. వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాప్‌టాప్స్ పై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక మరెందుకు ఆలస్యం… HDFC కార్డు ఉందా.. వెంటనే షాపింగ్ చేసేయండి.

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×