Big Stories

20% Discount on Moto G34: హోలీ సేల్.. Motorola G34 5జీ స్మార్ట్ ఫోన్ పై 20 శాతం డిస్కౌంట్!

Flipkart Holi Sale
Flipkart Holi Sale

Get 20% Instant Discount on Moto G34 Mobile on Holi Sale 2024: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. కంపెనీలు కూడా వెంట వెంటనే కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. రానురాను పోటీ అనేది కంపెనీల మధ్య కాకుండా మోడళ్ల మధ్య ఉండేలా కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు మధ్య ఓ రకమైన వార్ నడుస్తుందనే చెప్పాలి. ఏదైనా మోడల్ లాంచ్ అయిందంటే దాని వెంటనే మరో అధునాత ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తున్నారు.

- Advertisement -

దీంతో ఫోన్లు లాంచ్ అయిన వెంటనే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వీటి ధర అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థిలో ఫోన్ లవర్స్ డిసపాయింట్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్ తీసుకొచ్చింది. హోలీ సేల్‌లో భాగంగా మోటరోలా G34 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది 5జీ ఫోన్ కావడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఆఫర్ ఏంటో చూసేయండి.

- Advertisement -

మోటరోలా G34 5Gపై స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.14,999గా ఉంది. అయితే ఈ 5జీ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే రూ. 11,999కే దక్కించుకోవచ్చు.

Also Read: ఓ మైగాడ్.. ఇయర్ బడ్స్‌పై 50 శాతం డిస్కౌంట్..! భలే మంచి చౌక బేరం!

మోటరోలా G34 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 5జీ మొబైల్. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్‌‌తో కూడిన 6.5-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మంచి వీడియో క్వాలిటీని ఇస్తుంది. అలానే ఇందులో 60 Hz లేదా 120 Hzకి రిఫ్రెష్ రేట్‌ను సెట్ చేయవచ్చు. దీని ప్రైమరీ కెమెరా  50MP మెగాపిక్సెల్. 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటుంది. మంచి క్వాలీటీ ఫోటోలు తీయడానికి నైట్ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. దీనితో అద్భుతమైన సెల్ఫీలు తీయొచ్చు. బెస్ట్ వీడియో కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Qualcomm SM6375 Snapdragon 695 5G చిప్‌సెట్‌ను ఫోన్‌లో పొందుపరిచారు. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. అలానే 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఫాస్ట్‌గా ఛార్జ్ చేయొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News