BigTV English

Hardik Pandya Career: ఐపీఎల్.. హార్దిక్ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తోందా..?

Hardik Pandya Career: ఐపీఎల్.. హార్దిక్ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తోందా..?
Hardik Pandya
Hardik Pandya

Will IPL 2024 Affects Hardik Pandya’s Career: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏమీ కలిసి రాలేదు. అంతేకాదు తొలి మ్యాచ్ లో అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్, ఇటు గుజరాత్ ఫ్యాన్స్ కూడా హార్దిక్ ని టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గుజరాత్ కి ట్రోఫీ తీసుకొచి, రెండో ఏడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన పాండ్యా సడన్ గా జట్టుని వదిలేసి వెళ్లడంతో అక్కడ అభిమానులు వళ్లు మండి ఉన్నారు. ఇక్కడ ముంబయిలో ఆల్రడీ రగిలిపోతున్నారు.


దాంతో మ్యాచ్ లో టాస్ కి వెళ్లిన దగ్గర నుంచి హార్దిక్ ని టార్గెట్ చేసుకుని వెక్కిరింతలు, వెకిలి చేష్టలు చేయడంతో అది హార్దిక్ ఆట తీరుని ప్రభావితం చేసేలా కనిపిస్తోందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అభిమానులు ఉత్సాహపరిస్తే, ఆ జోష్ లో మరింత ఉద్వేగంగా ఆడతారు. అదిక్కడ లోపించిందని అంటున్నారు.

ఇకపోతే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లెవరూ కూడా హార్దిక్ పాండ్యాకు అంత సపోర్ట్ చేసినట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు జట్టులో సీనియర్ బౌలర్స్ ఉండి కూడా తను మూడు ఓవర్లు వేశాడు. ఎక్కువ పరుగులు కూడా సమర్పించుకున్నాడు. అలాగే మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో తను 7వ నెంబర్ ఆటగాడిగా వచ్చాడు.


అలాగే గ్రౌండ్ లో రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, లాంగ్ ఆన్ లోకి పంపడం, అటూ ఇటూ మార్చడం అంతా కరెక్ట్ కాదని అంటున్నారు. ఇవన్నీ వ్యూహాత్మక తప్పిదాలే అంటున్నారు. ఒకవేళ రోహిత్ అభిమానులు తనని టార్గెట్ చేస్తున్నారని పాండ్యా భావిస్తే, వారి మీద కోపాన్ని రోహిత్ పై చూపడం సరికాదని అంటున్నారు.

Also Read: Virat Kohli: కోహ్లీని పక్కన పెట్టే దమ్ముందా..? బీసీసీఐకి ఫ్యాన్స్ సవాల్..

ఏదేమైనా అటు ఆర్సీబీ, ఇటు సీఎస్కే రెండు జట్లు కూడా విరాట్, ధోనీ విషయంలో ఆచితూచి వ్యవహరించాయి. రోహిత్ విషయంలో ముంబై అలా చేయకపోవడమే ఇంత అనర్థానికి కారణమనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఫ్రాంచైజీ ఆటగాళ్లందరినీ దగ్గర కూర్చోబెట్టి రోహిత్, పాండ్యాకి సమాన ప్రాధాన్యత ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×