E-Paper
Advertisement

జేబులో రూపాయి లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.. Flipkart Pay Later ఆప్షన్ అదిరింది!

జేబులో రూపాయి లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.. Flipkart Pay Later ఆప్షన్ అదిరింది!
Advertisement

Flipkart Pay Later: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీడమ్ సేల్‌కు ముందే Flipkart Pay Later పేరుతో కొత్త క్రెడిట్ సేవలను ప్రారంభించింది. దీనికోసం ప్రముఖ పేయూ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు కావలసిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, ఆ తర్వాత సులభమైన వాయిదాలలో డబ్బులు చెల్లించవచ్చు.

ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?

ఈ కొత్త Pay Later సేవలు కేవలం ఫ్లిప్‌కార్ట్‌కే పరిమితం కాకుండా.. దానికి సంబంధించిన Myntra, Flipkart Minutes ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. నిత్యం వాడే నిత్యావసర వస్తువుల నుంచి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్ వరకు ఏవి కొన్నా చెల్లింపుల విషయంలో కస్టమర్లకు ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది.

మూడు రకాల చెల్లింపు మార్గాలు:

Advertisement

కొనుగోలు చేసిన వస్తువు విలువను బట్టి కస్టమర్లు 3 రకాల చెల్లింపు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మొదటిది 30 రోజుల్లోగా ఎలాంటి అదనపు రుసుము లేకుండా మొత్తం సొమ్మును చెల్లించడం. రెండోది మొత్తం బిల్లును మూడు సమాన వాయిదాలుగా మార్చుకోవడం. ఇక ఖరీదైన వస్తువుల కోసం 3 నుంచి 12 నెలల కాలపరిమితి కలిగిన EMI సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.

Also Read: గేమింగ్ ఫోన్ల రూపురేఖలు మార్చబోతున్న OnePlus 16.. ఏకంగా 9000mAh బ్యాటరీతో అఫీషియల్ టీజర్!

క్రెడిట్ నిర్ణయాలు ఎలా ఉంటాయి?

Advertisement

ఈ కార్యక్రమంలో పేయూ ఫైనాన్స్ లైసెన్స్ కలిగిన రుణదాతగా వ్యవహరిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ కస్టమర్ల లావాదేవీల చరిత్రను పర్యవేక్షిస్తుంది. వినియోగదారుల కొనుగోలు విధానం, షాపింగ్ అలవాట్లను బట్టి వారికి ఎంత క్రెడిట్ పరిమితి ఇవ్వాలనేది ఇరు సంస్థలు సంయుక్తంగా నిర్ణయిస్తాయి.

ఫుడ్ డెలివరీ రంగానికి విస్తరణ:

షాపింగ్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన సేవలు దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 8న ప్రారంభమయ్యే ఫ్రీడమ్ సేల్ సమయానికి ఈ పే లేటర్ సదుపాయం రావడం వినియోగదారులకు బాగా కలిసిరానుంది.

Also Read: ఆండ్రాయిడ్ 16తో వచ్చిన మొదటి మాస్ టాబ్లెట్ ఇదే.. Moto Pad 70 Groove ధర ఎంతంటే?

Related News

పాత ఫోన్ అమ్ముతున్నారా? సర్వం స్వాహా కావద్దంటే.. ఈ 5 తప్పులు చేయకండి!

భారీగా పెరగనున్న Nothing Phone 4a ధర.. వేరియంట్ల వారీగా కొత్త రేట్లు ఇవే!

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!

నాయిస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2299కే..డోంట్ మిస్

గేమింగ్ ఫోన్ల రూపురేఖలు మార్చబోతున్న OnePlus 16.. ఏకంగా 9000mAh బ్యాటరీతో అఫీషియల్ టీజర్!

మీ పేరుతో వేరే ఎవరైనా సీమ్ వాడుతున్నారా? ఇలా చెక్ చేసుకుని డియాక్టివేట్ చేయండి!

బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

Big Stories

Advertisement
×