BigTV English
Advertisement

Foldable iPhones : ఫోల్డబుల్ ఐఫోన్స్ నిజంగా రాబోతున్నాయా..!

Foldable iPhones : ఫోల్డబుల్ ఐఫోన్స్ నిజంగా రాబోతున్నాయా..!

Foldable iPhones : మార్కెట్‌లో ఆపిల్‌ (Apple) ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంటుదన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్‌లో మొబైల్‌ కంపెనీలు ఫోల్డబుల్‌ ఫోన్లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే శామ్‌సంగ్‌ (Samsung), వన్‌ప్లస్‌ (Oneplus), హువావే (huawei), మోటరోలా (Motorola), గూగుల్​ (Google)సహా తదితర కంపెనీలు ఫోల్డబుల్‌ మొబైల్స్‌ను లాంఛ్ చేశాయి. కానీ ఆపిల్‌ మాత్రం ఫోల్డబుల్‌పై దృష్టి మాత్రం సారించలేదు.


కానీ యాపిల్.. ఫోల్డబుల్​ పై దృష్టి పెట్టబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ దిశగానే మరింత ముందుకు ఆపిల్ అడుగులు వేస్తున్నట్లు తాజాగా సమాచారం అందింది. తాజాగా ఆపిల్​ ఈ ఫోల్డబుల్​ కోసం ‘కటింగ్ ఎడ్జ్​ హింజ్​ మెకానిజమ్’ (కొత్త, అత్యాధునిక ఫోల్డింగ్ మెకానిజమ్​​) కోసం పేటెంట్​ పొందినట్లు తెలుస్తోంది. అంటే దీని ద్వారా యాపిల్ ఫోల్డబుల్​ డివైస్​ను త్వరలోనే తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ విషయం యూఎస్ పేటెంట్​ అండ్ ట్రేడ్​ మార్క్​ ఆఫీస్ వెబ్​సైట్​లో ప్రచురితమైంది. ఈ హింజ్​ మెకానిజమ్ (ఫోల్డింగ్​)​ డిజైన్​ను స్మార్ట్ ఫోన్లతో పాటు ట్యాబ్లెట్స్​, ల్యాప్​ టాప్స్​ లేదా ఇతర డివైస్​లో ఉపయోగించొచ్చు. అయితే యాపిల్​ నుంచే రాబోయే ఆ ఫస్ట్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ డీటెయిల్స్​ ఏమిటనేది ఇంకా తెలీయలేదు. కాబట్టి ఫోల్డ్​బుల్​ స్మార్ట్ ఫోన్​ను యాపిల్ తీసుకొస్తుందా లేదా ఇతర ఫోల్డబుల్​ డివైస్​లను తీసుకొస్తుందా అనేది ప్రస్తుతానికి పక్కాగా తెలీదు.


పెటెంట్​​ ప్రకారం ఈ హింజ్ మెకానిజమ్​లో మాల్టిపుల్​ ఇంటర్​లాకింగ్​ లింక్స్​ ఉంటాయి. రొటేషన్​కు వీలుగా ఇవి సహకరిస్తాయి. తద్వారా డివైస్​ను ఫోల్డ్ లేదా అన్​ఫోల్డ్​ను సులభంగా చేసేయొచ్చు. రొటేషన్​ను కంట్రోల్​ చేసేందుకు ఇంటర్​లాక్డ్​ ఫింగర్స్​, క్రిసెంట్​ షేప్డ్​ స్లాట్స్​ ఉన్న ఫ్రిక్షన్ క్లచ్​ను కూడా ఈ హింజ్ మెకానిజమ్​లో ఉన్నట్లు పేటెంట్​లో రాసి ఉంది.

ఇంకా ఇందులో స్ర్పింగ్​, ప్యాడ్​, రోలర్​తో కూడిన ప్రత్యేకమైన కౌంటర్‌బ్యాలెన్స్ మెకానిజం కూడా ఉందని తెలిసింది. దీంతో పాటే యాపిల్స్​ ఫోల్డబుల్ డివైసెస్​లో కన్​సీల్డ్​ కెమెరా కూడా ఉంటుందట. దీనిని డివైస్​ ఫోల్డ్​ చేసినప్పుడు ఉండేలా అమర్చుతున్నారట. ఇంకా టు డైమెన్షనల్​ య్యారే, ఫ్లెక్సిబుల్ డిస్​ప్లే వంటివి ఈ ఫోల్డబుల్​ డివైస్​పై అటాచ్ చేయనున్నారు. మొత్తంగా యాపిల్​ తన ఫోల్డబుల్ ప్రొడెక్ట్​ను విడుదల చేయటానికి మరి కొన్నేళ్లు సమయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

అయితే ఆపిల్ ఫోల్డబుల్ డివైస్​ (Apple Foldable Phones) ను లాంఛ్​ చేస్తుందన్న వార్త వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. యూజర్లకు ఈ ఫోల్డబుల్​ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆపిల్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్​ ఫోన్స్​​ అందుబాటులోకి వస్తే మార్కెట్‌పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆపిల్‌ ఉత్పత్తులకు మార్కెట్లకు భారీగా డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ మెుబైల్స్ ఎప్పుటినుంచి అందుబాటులోకి రాబోతున్నాయో చూడాలి.

ALSO READ : ఇకపై వాట్సాప్ లోనే ట్రాన్స్లేషన్.. ఎలా పనిచేస్తుందంటే!

Related News

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

ChatGPT Wrong Answers: చాట్‌జిపిటిని నమ్మి మోసపోయాను.. ఏఐ సాయంతో పరీక్ష రాసి ఫెయిల్ అయిన సెలబ్రిటీ

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

Big Stories

×