WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)త్వరలోనే మరొక కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే తన కష్టమర్స్ కోసం ఎన్నో ఫీచర్స్ తీసుకొచ్చిన ఈ సోషల్ మెసేజ్ యాప్ త్వరలోనే ట్రాన్స్లేషన్ (Whats App Transltion) సదూపాయాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
ఎప్పటికప్పుడు తన కష్టమర్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ను తీసుకొస్తుంది ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్. ఇప్పటికే వాట్సాప్ డ్రాఫ్ట్ ఫీచర్ తో పాటు ఆడియో, వీడియో క్వాలిటీలను పెంచుతూ పలు ఫీచర్స్ ను తీసుకొచ్చింది. ప్రొఫైల్ ఫోటో విషయంలో సైతం సెక్యూరిటీని పెంచూతూ స్కీన్ షాట్స్ తీయకుండా ఉండే ఫీచర్ ను తెచ్చింది. ఇక ఇప్పుడు మరో ముందడుగు వేసి వినియోగదారుల కోసం ట్రాన్స్లేషన్ సదుపాయం తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వేరే భాషల్లో వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను ట్రాన్స్లేట్ చేసుకొని చదివే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ను తీసుకొచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వాబిటా ఇన్ఫో వెల్లడించింది. ఇక వాట్సప్ చాట్ తో పాటు గ్రూప్స్లో సైతం ఈ సదుపాయం ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఈ ఫీచర్ వేర్వేరు వాట్సాప్ గ్రూప్స్ ను ఉపయోగించే వినియోగదారులకు ఎక్కువగా ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది. నిజానికి వేరు వేరు గ్రూపుల్లో ఉన్నవారికి ఎన్నో భాషల్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ రానివారికి సైతం ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ అందుబాటులోకి వస్తే మెసేజెస్ చదవడం మరింత తేలిక అవుతుంది. దీంతో టెక్స్ట్ ను కాపీ చేసి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉండదు. గూగుల్ లోకి వెళ్లి మళ్లీ గూగుల్ ట్రాన్స్లేటర్ ను ఉపయోగించాల్సిన అవకాశం లేకపోవడంతో వినియోగదారులు తేలికగా మెసేజెస్ ను అర్థం చేసుకునే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తోంది
ఈ ఫీచర్ పూర్తిగా వాట్సాప్ డివైసెస్ లోనే పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో సెక్యూరిటీ కోసం ఉండే ఎండ్ టూ ఎండ్ ఎన్ స్ట్రిప్షన్ సైతం ఈ ట్రాన్స్లేషన్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సాధారణ టూల్స్ లో వేరే క్లౌడ్ సర్వీస్కు పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్లేషన్ చేసుకునే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఫ్రీ డౌన్లోడెడ్ లాంగ్వేజెస్ ప్యాక్ ఆధారంగా ఈ సర్వీస్ పనిచేయనున్నట్టు సమాచారం. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ వాట్స్అప్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు సైతం పనిచేయటంతో వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటున్నట్టు వాబిట ఇన్ఫో వెల్లడించింది.
అయితే.. ప్రతీ సందేశాన్ని ట్రాన్స్లేట్ చేయాలా? లేదా యూజర్ సెలెక్ట్ చేసుకున్న సందేశాన్ని మాత్రమే ట్రాన్స్లేట్ చేయాలా? అనే ఆప్షన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికైతే భారతదేశంలో ఎన్నో లాంగ్వేజ్ ఉండటంతో ఈ ఫీచర్ ఏ ఏ లాంగ్వేజ్ లో రాబోతుంది అనే విషయాన్ని వాబిటా ఇన్ఫో వెల్లడించలేదు. ఇక ఈ ఫీచర్ పై మరింత సమాచారం త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు సైతం తెలుస్తోంది.
ALSO READ : పిల్లలు తల్లిదండ్రులను హత్య చేస్తే తప్పేం కాదు.. షాకింగ్ సూచన చేసిన ఏఐ!