BigTV English

7/G Movie: ఓటీటీలోకి సోనియా అగర్వాల్ హారర్ థ్రిల్లర్ ‘7/G’.. ఎక్కడ చూడొచ్చంటే.?

7/G Movie: ఓటీటీలోకి సోనియా అగర్వాల్ హారర్ థ్రిల్లర్ ‘7/G’.. ఎక్కడ చూడొచ్చంటే.?

7/G Movie OTT: హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలామందికి ఈ జోనర్ ఫేవరెట్. అందుకే ఈ సినిమాలు థియేటర్లలో విడుదలయినా, ఓటీటీలో విడుదలయినా చాలావరకు సక్సెస్ అందుకుంటాయి. అలా మరొక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అదే ‘7/G’. ఒకప్పుడు ఇదే టైటిల్‌లో ఒక ప్రేమకథ తెరకెక్కింది. అది క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు అదే టైటిల్, అదే హీరోయిన్‌తో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం విశేషం. థియేటర్లలో విడుదయ్యి పరవాలదేనిపించిన ‘7/G’.. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


సోనియా కమ్ బ్యాక్

ఒకప్పుడు సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా ‘7/G బృందావన్ కాలనీ’ అనే ప్రేమకథ తెరకెక్కింది. ఈ సినిమా విడుదలయ్యి ఎన్నో ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఇది ఫేవరెట్‌గా నిలిచిపోయింది. సోనియా అగర్వాల్ కెరీర్‌లో కూడా ఈ మూవీ చాలా స్పెషల్‌గా మిగిలిపోయింది. ఈ మూవీకి ముందు, తర్వాత సోనియా నటించిన సినిమాల గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ‘7/G బృందావన్ కాలనీ’ గురించి తెలియని ప్రేక్షకులు తక్కువే. అలాంటి పాపులారిటీ సంపాదించుకున్న సోనియా అగర్వాల్.. తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా టైటిల్‌తోనే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ బుల్లితెరపైకి వచ్చేసింది. ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


Also Read: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

అదీ కథ

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘7/G’. హరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో తెరకెక్కింది. అక్కడ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే మూవీ తెలుగులో డబ్ అయ్యి నేరుగా ఓటీటీలో విడుదలయ్యింది. ‘7/G’ కథ విషనికొస్తే.. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలిసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ ఏదో చెడు జరుగుతుందని వర్షకు అనిపిస్తుంది. వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే ‘7/G’ కథ. డిసెంబర్ 12 నుండి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు.

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×