Portronics 20000 mAh MagSafe power bank: స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లు.. ఇలా రోజు వారీ జీవితంలో.. గాడ్జెట్ల వాడకం బాగా పెరిగిపోయింది. అయితే.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు ఫోన్ బ్యాటరీ ఐపోతే వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అందుకే.. ప్రముఖ ఇండియన్ బ్రాండ్ Portronics ఒక పవర్‌ఫుల్ సొల్యూషన్‌తో.. ముందుకు వచ్చింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ మోడల్ పవర్ బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చింది. వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ పవర్ బ్యాంక్ విశేషాలు, ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా 20000 mAh పవర్ బ్యాంక్‌లు అంటే.. బరువుగా, లావుగా ఉంటాయి. కానీ దీనిని చాలా కాంపాక్ట్ డిజైన్‌తో తీసుకొచ్చింది. అందుకే జేబులో లేదా చిన్న బ్యాగ్‌లో చాలా ఈజీగా పడుతుంది.
మ్యాగ్‌సేఫ్ గ్రైండ్: ఐఫోన్ 12 , అంతకంటే.. పై మోడల్స్ వాడుతున్న వారికి ఇది బాగా నచ్చుతుంది. పవర్ బ్యాంక్‌ను ఫోన్ వెనక భాగానికి పెడితే చాలు, బలమైన మ్యాగ్నెట్లతో గట్టిగా.. పట్టుకుని వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది.
నాన్-స్లిప్ గ్రిప్: పట్టుకోవడానికి వీలుగా.. ఉండే గ్రిప్ వల్ల ఫోన్ జారి పడిపోతుందనే భయం ఉండదు.
ఈ పవర్ బ్యాంక్ వైర్డ్, వైర్ లెస్ అనే రెండు రకాల ఛార్జింగ్ సౌకర్యాలను అందిస్తుంది.
22.5W వైర్డ్ ఛార్జింగ్: టైప్-సి పోర్ట్ ద్వారా కేబుల్ కనెక్ట్ చేస్తే ఏకంగా.. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ లభిస్తుంది. దీని వల్ల మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
15W వైర్‌లెస్ ఛార్జింగ్: వైర్‌లెస్ మోడ్‌లో గరిష్టంగా.. 15W వరకు ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. Qi-సపోర్ట్ ఉన్న ఏ ఫోన్‌కైనా దీని ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఇందులో.. ఏకంగా 20000 mAh భారీ సామర్థ్యం గల లిథియం-పాలిమర్ బ్యాటరీ ఇచ్చారు. దీని ద్వారా సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను 3 నుంచి 4 సార్లు పూర్తి స్థాయిలో.. ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెల్స్ చేసేవారికి, ఆఫీస్ వర్క్ మీద బయట ఉండే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డివైజ్.
ఒకేసారి మల్టీ-డివైజ్ ఛార్జింగ్ & సేఫ్టీ ఫీచర్లు:
మల్టీ-పోర్ట్ సపోర్ట్: ఒకే సమయంలో.. వైర్‌లెస్, కేబుల్ ద్వారా రెండు వేర్వేరు డివైజ్ (ఫోన్, ఇయర్‌బడ్స్ వంటివి) లను ఒకే సారి ఛార్జ్ చేయవచ్చు.
అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్: ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్ కాకుండా .. అనేక రకాల సేఫ్టీ చిప్‌సెట్లను ఇందులో అమర్చారు. దీనివల్ల మీ ఖరీదైన ఫోన్‌కి ఎలాంటి ప్రమాదం ఉండదు.
Also Read: బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!
ఇండియన్ మార్కెట్లో ఈ పవర్ బ్యాంక్ రూ. 2,149. ఈ పవర్ బ్యాంక్ ప్రముఖ.. ఇ-కామర్స్ సైట్లు, ఎలక్ట్రానిక్స్ షాపుల్లో అందుబాటులో ఉంది.
రూ. 2,149 బడ్జెట్‌లో.. 20000 mAh కెపాసిటీ, మ్యాగ్ సేఫ్ వైర్ లెస్ ఛార్జింగ్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్.. అండ్ జేబులో.. పట్టేంత కాంపాక్ట్ సైజ్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక వర్త్ అండ్ పర్ఫెక్ట్ ఆప్షన్.