BigTV English

Game of Thrones: 12,500 ఏళ్ల కిందట అంతరించిపోయిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నక్కల జాతికి మళ్లీ ప్రాణం!

Game of Thrones: 12,500 ఏళ్ల కిందట అంతరించిపోయిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నక్కల జాతికి మళ్లీ ప్రాణం!

‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ హిట్ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇందులోని తోడేళ్లు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈ తోడేలు జాతులు ఏకంగా 12, 500 ఏళ్ల క్రితమే భూమ్మీద అంతరించాయి. కానీ, ఇప్పుడు అదే జాతికి చెందిన తోడేళ్లు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. వేలాది సంవత్సరాల క్రితం అంతమైన తోడేళ్లు ఇప్పుడు ఎలా పుట్టాయని ఆశ్చర్యపోతున్నారా? జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రక్రియ ద్వారా వాటిని పునఃసృష్టించారు శాస్త్రవేత్తలు.


టెక్సాస్ పరిశోధకుల అద్భుతం

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన జెనెటిక్ ఇంజినీరింగ్ సంస్థ కోలోసల్ బయోసైన్సెస్ ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. ప్రపంచంలోనే తొలిసారి అంతరించిపోయిన భయంకరమైన నక్కలను జన్యు సవరణల ద్వారా తిరిగి ప్రాణం పోసింది.  భయంకరమైన మూడు తోడేళ్లను శాస్త్రవేత్తలు పుట్టించారు.  “సైన్స్ పురోగతిలో ఇదో విప్లవాత్మక మైలురాయి. ఇది కొలోసల్ డీ ఎక్సెటెన్షన్లో ముందడుగు. అంతరించిన జీవ జాతులను మళ్లీ పుట్టించడంలో కీలక మలుపు. ఈ విజయం మరెన్నో అద్భుతాలకు శ్రీకారం కాబోతోంది” అని కొలోసల్ బయోసైన్సెస్ వెల్లడించింది. “వినూత్నమైన ‘నాన్ ఇన్వాసివ్ బ్లడ్ క్లోనింగ్ టెక్నిక్’ ఉపయోగించి ప్రపంచంలోనే అంతరించిపోయిన తోడేలు జాతికి చెందిన తోడేళ్ళను కోలోసల్ బయోసైన్సెస్ విజయవంతంగా క్లోన్ చేసింది. మొత్తం మూడు తోడేళ్లలో రెండు మగ(రోములస్, రెమస్), ఒక ఆడ (ఖలీసి) ఉన్నాయి” అని సదరు సంస్ధ ప్రకటించింది.


వీడియో షేర్ చేసిన కోలోసల్

ఇక క్లోనింగ్ ద్వారా ప్రాణం పోసిన తోడేళ్లకు సంబంధించిన వీడియోను కోలోసల్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఇందులో భయంకరమైన తోడేళ్లు తెలుపు వర్ణంలో క్యూట్ గా అరుస్తూ కనిపిస్తున్నాయి. “మీరు సుమారు 10 వేల సంవత్సరాల తర్వాత భయంకరమైన తోడేలు అరుపులను వింటున్నారు. ప్రపంచంలోనే తొలిసారి అంతరించిపోయిన తోడేళ్లు రోములస్, రెమస్ లను కలవండి. ఇవి అక్టోబర్ 1, 2024న జన్మించాయి” అని వెల్లడించింది.

కోలోసల్ బయోసైన్సెస్ గురించి..

2021లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు బెన్ లామ్, జార్జ్ చర్చి కోలోసల్ బయోసైన్సెస్ సంస్థను స్థాపించారు. అంతరించి పోయిన జాతులను జన్యు సవరణల ద్వారా మళ్లీ ప్రాణం పోయాలనేది ఈ సంస్థ లక్ష్యం. ఆ తర్వాత దాని పరిధి మరింత విస్తరించింది. ఆస్ట్రేలియన్ థైలాసిన్ (టాస్మానియన్ టైగర్), డోడో లాంటి ఐకానిక్ జాతులకు మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు.

Read Also: పెంట్ హౌస్ రూ.940 కోట్లా? అంత స్పెషల్ ఏంటో!

కోలోసల్ సీఈవో ఏమన్నారంటే?

ఇక అరుదైన తోడేళ్లకు ప్రాణం పోయడం పట్ల కోలోసల్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు బెన్ లామ్ సంతోషం వ్యక్తం చేశారు. “ఇది మా సంస్థ సాధించిన గొప్ప మైలురాయి. మా బృందం 13,000 సంవత్సరాల పురాతన పంటి, 72,000 సంవత్సరాల పురాతన పుర్రె నుంచి DNA తీసుకొని భయంకరమైన తోడేలు పిల్లలను తయారు చేసింది. ఇదో అద్భుత సృష్టిగా మేం భావిస్తున్నాం. మున్ముందుకు మరిన్ని అద్భుతాలను సృష్టించబోతున్నాం” అని లామ్ వెల్లడించారు. ఈ అద్భుత సృష్టిని అపరకుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) అభినందించారు.

Read Also: మాజీ ప్రేయసి తండ్రి అస్తికలు దొంగిలించిన ప్రియుడు.. అలా చేస్తే తిరిగిస్తాడట!

Related News

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి

Whatsapp Guest Feature: అకౌంట్ లేకుండానే వాట్సాప్ మేసేజ్ పంపించవచ్చు.. ఎలాగంటే?

Samsung Truck Stolen: రూ 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ.. 12000 శామ్‌సంగ్ డివైస్‌లు ఉన్న ట్రక్కు మాయం

Big Stories

×