ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా గుర్తింపు తెచ్చుకున్న న్యూయార్క్ మాన్ హట్టన్ లోని స్టెయిన్‌వే టవర్ పైన ఉన్న నాలుగు అంతస్తుల పెంట్ హౌస్ ను అమ్మకానికి ఉంచారు. ఈ ఇల్లును ఏకంగా $110 మిలియన్ డాలర్లకు(రూ. 940,82,45,000) ధర ఫిక్స్ చేశారు. న్యూయార్క్ నగరంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పెంట్ హౌస్ 80 నుంచి 83వ అంతస్తు వరకు ఉంటుంది. మొత్తం11,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నది. ఈ పెంట్ హౌస్ ఐదు బెడ్ రూమ్ లు, ఆరు బాత్రూమ్ లు, 618 చదరపు అడుగుల బయటి టెర్రస్ లను కలిగి ఉంది.
ప్రపంచంలోనే సన్నని ఆకాశహర్మ్యంగా గుర్తింపు
దీనిని JDS డెవలప్‌మెంట్ గ్రూప్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ కలిసి నిర్మించాయి. ఈ క్వాడ్ప్లెక్స్ నివాసం ఎత్తైన, అత్యంత ప్రసిద్ధ నివాస టవర్లలో ఒకటి. దీనిలో నుంచి స్కైలైన్, సెంట్రల్ పార్క్ అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. తాజాగా ఈ ఇంటి అమ్మకానికి సంబంధించి కథనాన్ని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. స్టెయిన్ వే టవర్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఒక్కో అంతస్తులో ఒక్కో ప్రత్యేకత
80వ అంతస్తులో ఉన్న ఫ్లోర్ లో గ్రాండ్ ఎంట్రీ హాల్, సౌత్ వైపున వంటగది ఉన్నాయి. ఇది ప్రైవేట్ టెర్రస్‌కు నేరుగా యాక్సెస్ కలిగి ఉంటుంది. రెండవ అంతస్తులో నాలుగు బెడ్ రూమ్ లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎన్సూట్ బాత్ రూమ్ లతో కూడిని లాంజ్, వెట్ బార్ ఉంటుంది. మూడవ అంతస్తు పూర్తిగా బూడిద, తెలుపు ఒనిక్స్‌తో కప్పబడిన డ్యూయల్ బాత్రూమ్‌లతో కూడి ఉంటుంది. 2,800 చదరపు అడుగుల సూట్ ఉంటుంది. ఇక చివరగా క్రౌన్ సూట్ అని పిలువబడే పై అంతస్తు వినోదం కోసం రూపొందించబడింది. ఇందులో బార్, ప్రైవేట్ స్క్రీనింగ్ రూమ్, సర్వీస్ కిచెన్, మరొక టెర్రస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పెంట్ హౌస్ ఖాళీగా ఉంది.
Read Also: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి ట్రంప్ మామ ఎంట్రీ.. బ్యాన్ చేస్తారట!
అమ్మకానికి 8 యూనిట్లు
ఈ పెంట్ హౌస్ లగ్జరీ స్ప్రింగ్ మార్కెట్ కు గుర్తింపు గా నిలువబోతుందని సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాలిటీకి చెందిన మెయిన్ బ్రోకర్ నిక్కీ ఫీల్డ్ వెల్లడించారు. 2024 సమ్మర్ లో తమ ఆధీనంలోకి తీసుకున్న Ms ఫీల్డ్, సోథెబీస్‌లోని ఆమె బృందం టవర్ ను రీబ్రాండ్ చేసి, కొత్త ధరలను నిర్ణయించింది. ఈ ఏడాది 8 యూనిట్లు ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ మొదలయ్యిందని చెప్పింది. పెంట్ హౌస్ 80 రికార్డు ధర పలుకుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. “మనమందరం చాలా విలాసవంతమైన ప్రదేశాలకు వెళ్ళాము. కానీ, ప్రపంచంలో మరెక్కడా లేని భవనాన్ని సృష్టించాలనుకున్నాను” అని స్టూడియో సోఫీల్డ్ వ్యవస్థాపకుడు విలియం సోఫీల్డ్ వెల్లడించారు. ఆయనే ఈ భవంతికి శ్రీకారం చుట్టారు.
Read Also: వీధి కుక్కలు ఉండాలి.. లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి – తాజా స్డడీలో షాకింగ్ విషయాలు!
Read Also: వ్యాన్ ఆపి, కోళ్లను కొన్న అనంత్ అంబానీ, నెట్టింట వీడియో వైరల్!