Avocado benefits: అవకాడోను(Avocado) బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీన్ని తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అవకాడోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండుగా ఉంటాయి.
కడుపులో మంట, వాపు, నొప్పులను తగ్గించేందుకు కూడా అవకాడో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా తరచుగా అవకాడో తింటే త్వరగా ఉపశమనం లభిస్తుందని వద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో దీన్ని తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
తరచుగా అవకాడో తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుందట. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా చేయడంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్న వార అవకాడోను ఎక్కువగా తినడం మంచిదట. దీన్ని తరచుగా తీసుకుంటే శరీరంలో ఉన్న మలినాలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
అవకాడో తినడం వల్ల తీసుకున్న ఆహారాన్ని జీర్ణ చేయడానికి సహాయపడే బాక్టీరియా పెరుగుతుందట. అవకాడోలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందట. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అవకాడోను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తు్న్నారు.
ALSO READ: విటమిన్-డి ఎక్కువైతే ఏం అవుతుంది..?
అవకాడోలో మినరల్స్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అవకాడోలో విటమిన్-సి, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్-సి సహాయపడుతుందట. అంతేకాకుండా అవకాడోలో ఉండే విటమిన్-ఇ వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యవంతంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అవుతున్న వారు అవకాడోను కూడా తినడం మంచిదని న్యూట్రీషనిస్ట్‌లు చెబుతున్నారు. అందుకే బెల్లీ ఫ్యాట్‌ని తొలగించేందుకు కూడా ఇది సహాయపడుతుందని అంటున్నారు. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంల అవకాడోని తీసుకోవాలని సూచిస్తున్నారు.
కంటి చూపు సమస్యలను దూరం చేయడంలో కూడా అవకాడో సహాయపడుతుందట. ఇందులో ఉండే విటమిన్-ఎ వల్ల కంటి చూపు సమస్యలు తొలగిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.