Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్స్‌కు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. అందుకే టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఫినాలే టెన్షన్ పోగొట్టడానికి యాంకర్ సుమ హౌస్‌లోకి అడుగుటపెట్టింది. కంటెస్టెంట్స్‌తో ఆటలు ఆడించి, పాటలు పాడించి, వారితో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేసింది. సుమ కనకాల బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన ప్రోమో ఆల్రెడీ విడుదల కాగా.. కంటెస్టెంట్స్‌తో ఎలాంటి ఆటలు ఆడించిందో దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. మొత్తానికి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫైనల్స్ అనే విషయాన్ని మర్చిపోయి సుమ అల్లరిలో లినమయిపోయి ఎంజాయ్ చేయనున్నారని ఈ ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.
ప్రేరణది అతి తెలివి
‘‘ఇప్పుడు మనం ఆడే గేమ్‌లో విన్ అయినవారి కోరిక తీరుతుంది’’ అంటూ గేమ్ గురించి సుమ చెప్పడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అందులో ముందుగా నిఖిల్ వచ్చి యాక్టింగ్ చేసి చూపించగా.. ఆ పదమేంటో గౌతమ్ కనిపెట్టాలి. కోతి చేష్టలు అనే పదాన్ని గౌతమ్ వెంటనే కనిపెట్టాడు. చింతపండు అనే పదాన్ని ప్రేరణ యాక్ట్ చేసి చూపించగా అది గులాబ్ జామున్ అనుకున్నాడు నబీల్. నబీల్ యాక్ట్ చేసి చూపించినప్పుడు అది గొడుగు అని కరెక్ట్‌గా గెస్ చేసింది ప్రేరణ. నిఖిల్‌కు అతి తెలివి అనే పదాన్ని అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రేరణను చూపించాడు గౌతమ్. దానికి నిఖిల్ కరెక్ట్‌గా గెస్ చేశాడు. కానీ అది ప్రేరణ చాలా ఫన్నీగా తీసుకుంది.
Also Read: హౌస్ లోకి సుమక్క.. కంటెస్టెంట్స్ రహస్యాలు గుట్టు..!
సుమ డ్యాన్స్
కోతి చేష్టలకు నన్ను ఉదాహరణగా చూపిస్తారనుకున్నాను కానీ అతితెలివికి చూపించారు అని లైట్ తీసుకుంది ప్రేరణ. అది చాలా గొప్ప విషయమని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది సుమ. ఆ తర్వాత మరొక ఫన్నీ టాస్క్ మొదలయ్యింది. ప్రేరణ బూర ఊదుతుంటే గౌతమ్, అవినాష్ ఆ పాట ఏంటో గెస్ చేయాలి. గౌతమ్‌కు ఆ పాట తెలియకపోవడంతో అవినాష్ చేతితోనే గంట కొట్టేలా చేశాడు. కానీ అవినాష్ తప్పు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత బూర ఊదే ఛాన్స్ నిఖిల్‌కు వచ్చింది. ఈసారి అవినాష్ కరెక్ట్‌గానే సమాధానం చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ అందరితో కలిసి సుమ కూడా స్టెప్పులేశారు. సుమ వచ్చిన తర్వాత టాస్కులకు బ్రేకే లేదు. అలా మరొక టాస్క్ మొదలయ్యింది.
మరో ఆట
‘‘మ్యూజిక్ ప్లే అవుతుంది. అది ఆగిపోగానే కింద గీసి ఉన్న ఫిగర్స్‌లో ఎవరైతే కరెక్ట్‌గా పడుకుంటారో వారే విన్నర్స్’’ అని తరువాతి టాస్క్ గురించి సుమ వివరించారు. ఇలా కంటెస్టెంట్స్ అందరితో ఫన్నీ ఆటలు ఆడించి ఎప్పటికప్పుడు వారిని అలరించారు సుమ. ఆ ఆటలు చూసి ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్ అయ్యారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేకు ఇంకా ఒక్కరోజే ఉండగా.. అసలు విన్నర్ ఎవరు అనే విషయంపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ అంతా తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ విన్ అయితే బాగుంటుందని ఆశపడుతున్నారు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో, ఎవరికి ఆ ప్రైజ్ మనీ దక్కుతుందని కొన్నిగంటల్లో బయటపడుతుంది.