BigTV English

Hero Nani: తొలిసారి మల్టీస్టారర్ గా నాని.. మరో ప్రయోగానికి సిద్ధం..!

Hero Nani: తొలిసారి మల్టీస్టారర్ గా నాని.. మరో ప్రయోగానికి సిద్ధం..!

Hero Nani.. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు నేచురల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాని(Nani). తన అద్భుతమైన నటనతో, మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో ‘హిట్ 3’తో పాటూ దసరా దర్శకుడితో సినిమా.. ఈ రెండు ప్రస్తుతం లైన్ లో ఉండగా.. వేటికవే ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ఇకపోతే మరోవైపు ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ (Director Sujeeth)దర్శకత్వంలో వస్తున్న సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


నాని – సుజీత్ కాంబో మల్టీస్టారర్..

నాని, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli)నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాని చేయాల్సిన రెండు సినిమాలు పూర్తయ్యాక సుజీత్ సినిమా ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇంకో విషయం వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు మరో పాత్ర కూడా కీలకంగా ఉంటుందని, దాదాపు హీరోతో సమానమైన పాత్ర అని, అందులోనూ ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కబోతోంది అని సమాచారం. అయితే నానితో పాటు ఎవరు మరో హీరోగా నటిస్తున్నారు..? అసలు తెలుగు వారేనా? లేక ఇతర భాషకు చెందినవారా..? ఒకవేళ ఇతర భాషకు చెందిన వారైతే.. ఆయన ఏ భాష నటుడు? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రయోగానికి సిద్ధం..

వాస్తవానికి తన పాత్రను మించిన పాత్ర సినిమాలో ఉన్నా నాని ఏ రోజు కూడా ఫీల్ అవ్వకుండా.. ప్రయోగాలు చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇప్పుడు మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో నాని పాత్ర కంటే సూర్య పాత్రకు మంచి పేరు వచ్చింది. అయినా సరే నాని ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఓజీ డైరెక్టర్ సుజీత్ సినిమాలో మరో హీరోని తీసుకొస్తుండడంతో నాని కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని సమాచారం. ఇకపోతే తెలుగు హీరోనా? లేక ఇతర భాష నటుడిని తీసుకొస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వాస్తవంగా రెండు వేరువేరు భాషలకు చెందిన హీరోలు ఒకే సినిమాలో నటిస్తే మార్కెట్ పరంగా డిమాండ్ పెరుగుతుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా మల్టీ స్టారర్ మూవీ అనగానే ఇద్దరు హీరోలను వివిధ భాషలకు చెందిన వారిని తీసుకొస్తారు. మరి నాని – సుజీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎవరిని తీసుకుంటారు అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా నాని మల్టీస్టారర్ అంటూ మరో కొత్త ప్రయోగానికి సిద్ధం అవడంతో అభిమానులు సైతం ఎగ్జైట్ ఫీలవుతున్నారు.

నిర్మాత గానే కాదు హోస్ట్ గా కూడా..

ఇకపోతే నాని హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే 2014లో నిర్మాతగా మారిన నాని ‘డీ ఫర్ దోపిడీ’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ‘ఆ!’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘బిగ్ బాస్ సీజన్ 2’ కి హోస్ట్ గా కూడా వ్యవహరించిన ఈయన చివరిగా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటించారు. మరోవైపు హిట్ ఫ్రాంచైజీలకి కూడా ఈయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×