E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!
Advertisement

GOBOULT Astra Neo TWS: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకోసం మార్కెట్లో ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ బోల్ట్ నుంచి వచ్చిన ఈ మోడల్ ఇయర్‌ బడ్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచాయి. కేవలం రూ. 1,099 అతి తక్కువ ధరలో 70 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ , 4 మైక్ ENC తో వస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం యాత్ ఫేవరెట్ గా మారుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో  బెస్ట్ మోడల్స్ గా నిలిచిన వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ట్రెండీ వైట్ డిజైన్ , కంఫర్ట్ గ్రిప్ కేస్: 

ప్రస్తుత యూత్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ఇయర్‌ బడ్స్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ప్యూర్ వైట్ కలర్ ఫినిషింగ్‌తో .. వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. దీనితో వచ్చే ‘కంఫర్ట్ గ్రిప్ కేస్’ చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మెరుగైన లుక్ కోసం ఇందులో.. మోడ్ సింక్ ఎల్‌ఈడీ లైట్లు కూడా ఇచ్చారు. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎర్గోనామిక్‌గా వీటిని రూపొందించారు. కాబట్టి రోజంతా వాడినా నొప్పులు రావు.

70 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ ,ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

మ్యూజిక్ లవర్స్‌కు , ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి.. బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో..ఈ మోడల్ అద్భుతమైన పని తీరును కనబరుస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి వాడితే ఇది ఏకంగా 70 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది! అంటే ఒక్కసారి.. ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు వారం రోజుల పాటు ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండనే ఉండదు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా.. ‘లైటనింగ్ బోల్ట్’ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. సుమారు 100 నిమిషాల పాటు క్వాలిటీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం 4 మైక్ ENC:

ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టూ ఉండే.. శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఇందులో పవర్ ఫుల్ ‘జెన్ క్వాడ్ మైక్ ENC’ టెక్నాలజీని జోడించారు. ప్రతి ఇయర్‌ బడ్‌లో మైక్రోఫోన్లు ఉండటం వల్ల రద్దీగా ఉండే రోడ్లపై లేదా మార్కెట్లలో తిరుగుతున్నప్పటికీ మీ.. గొంతు అవతలి వారికి అత్యంత స్పష్టంగా వినిపిస్తుంది. వాయిస్ కాల్స్ క్లారిటీ విషయంలో ఈ బడ్జెట్ రేంజ్‌లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

బ్లూటూత్ 5.4,  లో-లేటెన్సీ మోడ్:

Advertisement

కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వెర్షన్‌ను అందించారు. ఇది చాలా ఫాస్ట్ స్థిరమైన కనెక్షన్‌ను ఇస్తుంది. ‘బ్లింక్ అండ్ పేర్’టెక్నాలజీ ద్వారా కేస్‌ ఓపెన్ చేయగానే మీ ఫోన్‌కు ఇయర్‌బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అయిపోతాయి.

Also Read: రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్

అలాగే ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవారి కోసం .. ఇందులో ప్రత్యేకంగా 40ms అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉంది. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా రియల్-టైమ్ సింక్ లభిస్తుంది. 13mm బూమ్ఎక్స్ టెక్ డ్రైవర్లు డీప్ బాస్‌తో కూడిన అద్భుతమైన సౌండ్ ఫీల్ ఇస్తాయి. IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల చెమట లేదా వర్షం పడినా ఇయర్‌బడ్స్ పాడవవు.

ధర :

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ. 1,099 మాత్రమే. కేవలం.. వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. 70 గంటల బ్యాటరీ, బ్లూటూత్ 5.4, 4 మైక్ ENC, గేమింగ్ మోడ్ కోరుకునే స్టూడెంట్స్, యూత్‌కు ఇది ఒక అద్భుతమైన ,వ్యాల్యూ ఫర్ మనీ ఛాయిస్!

Related News

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!

యూత్ ఫిదా అయ్యే లుక్ & ఫీచర్స్..మోటో కొత్త బడ్స్ లాంచ్!

Big Stories

Advertisement
×