Sourav Ganguly supports Mohammed Shami : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami ) రీ-ఎంట్రీ పై తీవ్ర సందిగ్ధత నెలకొంది. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియాలో మెరిసిన మహమ్మద్ షమీ… ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిట్నెస్ కారణంగా అతడిని పక్కకు పెట్టిన బీసీసీఐ… మళ్లీ తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ తో పాటు దేశవాళి క్రికెట్ లో మహమ్మద్ షమీ వికెట్ల పైన వికెట్లు తీస్తున్నాడు. అయినప్పటికీ బీసీసీఐ అటు గౌతమ్ గంభీర్ పట్టించుకోవడం లేదు. మహమ్మద్ షమీ ఉన్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారు.
టీమిండియాలోకి మహమ్మద్ షమీ రీ-యంట్రీ ఇవ్వాలని అభిమానులు చాలా కోరుకుంటున్న నేపథ్యంలో… మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మహమ్మద్ షమీ ముసలోడు అయ్యాక టీమిండియాలోకి తీసుకుంటారా ? ఇంకా ఎన్ని రోజులు అతడిని వెయిట్ చేయిస్తారు ? దీనిపై గౌతమ్ గంభీర్ సమాధానం చెప్పాలని ఓ రేంజ్ లో దాదా ఫైర్ అయ్యారు. దేశవాళితో పాటు ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్న అతడిని సెలెక్ట్ చేయకుండా నిద్రపోతున్నారా ? తమలాంటి సీనియర్లు చెప్పేదాకా మాట వినరా ? అసలు మనుషులేనా మీరు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు దాదా.
మహమ్మద్ షమీ అద్భుతమైన ఛాంపియన్ అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. అతని వయసు 30 దాటింది. త్వరలో 4 పదుల వయసులో కూడా పడబోతున్నాడు. ఇలాంటి క్రమంలో అతడికి అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ, గౌతమ్ గంభీర్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆటగాళ్ల వయసు పెరిగే కొద్దీ.. ఫిట్నెస్ కూడా కోల్పోతారు. ఇలాంటి నేపథ్యంలో వెంటనే మొహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుమ్రా సరైన ఫిట్నెస్ తో లేని నేపథ్యంలో… మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటే తప్పేంటి ? అని ప్రశ్నించారు.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో మహమ్మద్ షమీని పరిగణలోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని కూడా సూచనలు చేశారు దాదా. దేశవాళితో పాటు ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి… 2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ ప్రదర్శన రిపీట్ అవుతుందని కూడా తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు నచ్చిన వాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకుంటున్నాడని ఆగ్రహించారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో బీసీసీఐ కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని దాదా వెల్లడించారు. ఇలాగే గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తే టీమిండియా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.