GOBOULT Mustang Dyno Review: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను వాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆఫీస్ పని చేసుకు నేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆడియో బ్రాండ్ గోబౌల్ట్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘గోబౌల్ట్ ముస్తాంగ్ డైనే’ టెక్ లవర్స్ మొదటి ఆప్షన్‌గా మారుతోంది. ఆకర్షణీయమైన సిల్వర్ రంగులో లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ప్రీమియం సిల్వర్ ఫినిషింగ్‌తో వస్తాయి. చెవుల్లో పెట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉండేలా వీటిని రూపొందించారు. అలాగే ఇవి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తాయి. దీని వల్ల వర్షంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టినా ఇయర్ బడ్స్ పాడైపోకుండా ఉంటాయి.
మ్యూజిక్ లవర్స్ ను అలరించేందుకు ఇందులో పవర్ ఫుల్ హార్డ్‌వేర్ అమర్చడం జరిగింది. అంతే కాకుండా ఇందులో పెద్ద 13ఎంఎం ఆడియో డ్రైవర్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల పాటల్లో బేస్ చాలా స్పష్టంగా, లౌడ్‌గా వస్తుంది. గేమ్స్ ఆడే వారి కోసం ప్రత్యేకంగా తక్కువ లేటెన్సీ ఫీచర్ ఉంది. దీని వల్ల గేమింగ్‌లో శబ్దానికి తగినట్లుగా వేగంగా స్పందించవచ్చు. కాలింగ్ సమయంలో చుట్టుపక్కల సౌండ్స్ తగ్గించడానికి ప్రత్యేక నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. దీని వల్ల రద్దీ ప్రాంతాల్లో ఉన్నా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ సామర్థ్యం. ఛార్జింగ్ బాక్స్‌తో కలిపి మొత్తం 60 గంటల నాన్ స్టాప్ ప్లేటైమ్ లభిస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు. మొబైల్ అప్లికేషన్ సపోర్ట్ ఉండటం వల్ల సౌండ్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇందులో డ్యుయల్ పేరింగ్ అవకాశం ఉంది. అంటే ఒకే సమయంలో.. రెండు పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ మాట్లాడటం, పాటలు మార్చడం ఈజీగా చేయెచ్చు.
Also Read: తక్కువ కరెంట్ బిల్లుతో అద్భుతమైన కూలింగ్..హయర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్
మార్కెట్లో ఈ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 4,999 వరకు ఉండగా.. ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్‌లో ఇది భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.1,299 ధరకే లభిస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
తక్కువ ధరలో.. బెస్ట్ పెర్మామెన్స్,పవర్ ఫుల్ బేస్ అందించే ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. గోబౌల్ట్ ముస్తాంగ్ డైనే ఒక అద్భుతమైన ఆప్షన్. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కావడంతో ..దీనిపై నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ కొనాలని ఆలోచిస్తుంటే.. దీనిపై ఓ లుక్కేయండి.