Haier 190L 5 star refrigerator: ఇంట్లో ఆహార పదార్థాలు పాడవకుండా తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి ఫ్రిజ్ కొనాలని చూస్తున్నారా? తక్కువ కరెంట్ ఖర్చుతో బెస్ట్ కూలింగ్ అందించే మోడల్ కోసం వెతుకుతున్నట్లయితే.. మార్కెట్లో ‘Haier 190 L 5 Refrigerator’ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఆకర్షణీయమైన డాజిల్ స్టీల్ లుక్‌తో వస్తున్న ఈ ఫ్రిజ్ ధర రూ. 16,590 మాత్రమే.తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫ్రిజ్ చూడటానికి చాలా మోడ్రన్‌గా , ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రీమియం డాజిల్ స్టీల్ ఫినిషింగ్‌తో వస్తుంది కాబట్టి మీ వంటింట్లో ఇది చాలా స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. దీని వెనక భాగం ఈజీగా క్లీన్ చేసుకునేలా డిజైన్ చేయబడింది. ఇది సేఫ్టీని కూడా అందిస్తుంది. ఈ ఫ్రిజ్ చూడగానే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా దీని లుక్ ఉంటుంది.
ఈ ఫ్రిజ్ సామర్థ్యం 190 లీటర్లు ఉండటం వల్ల.. ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉండే ఫ్యామిలీలకు లేదా బ్యాచిలర్స్‌కు ఇది సరిగ్గా సరి పోతుంది. కూరగాయలు, పండ్లను ఎక్కువ సేపు తాజాగా ఉంచడానికి ఇందులో.. పెద్ద సైజు వెజిటబుల్ బాక్స్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా పదార్థాలు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.
ఈ ఫ్రిజ్ మెయిన్ హైలైట్ దీని ఫాస్ట్ కూలింగ్. ఇందులో ఉన్న ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా అతి తక్కువ సమయంలో.. గడ్డకట్టే ఐస్‌ను పొందొచ్చు. డైరెక్ట్ కూల్ విధానం ద్వారా తక్షణ కూలింగ్ అందిస్తుంది. అలాగే గ్లాస్ షెల్ఫ్‌లు బరువైన పాత్రలను కూడా మోయగలవు, దీని వల్ల వంటగదిలో పని మరింత ఈజీ అవుతుంది.
కరెంట్ బిల్లు గురించిన టెన్షన్ లేకుండా దీన్ని వాడొచ్చు, ఎందుకంటే.. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. కాబట్టి కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ కారణంగా సౌండ్ తక్కువగా వచ్చి, లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఇది ఇంటి బడ్జెట్‌ను ఎంతో ఆదా చేస్తుంది.
Also Read: రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!
మార్కెట్లో ఈ హయర్ 190 లీటర్ల 5 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ ధర సుమారు రూ. 16,590 వరకు ఉంది. బడ్జెట్ ధరలో.. ఎక్కువ స్టార్ రేటింగ్, తక్కువ కరెంట్ బిల్లు కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆన్‌లైన్ స్టోర్లలో లభించే వివిధ ఆఫర్లను ఉపయోగించుకుని దీనిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
తక్కువ ధరలో బెస్ట్ ఫెర్హామెన్స్, లేటెస్ట్ డిజైన్‌ను అందించే సింగిల్ డోర్ ఫ్రిజ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ చక్కటి ఛాయిస్. తక్కువ కరెంట్ ఖర్చు, పెద్ద వెజిటబుల్ బాక్స్ , ఫాస్ట్ ఐస్ మేకింగ్ దీని ప్రధాన ప్రత్యేకతలు. మీరు కూడా కొత్త హోమ్ అప్లయన్స్ కొనాలని ఆలోచిస్తుంటే ..దీనిని నిస్సందేహంగా కొనొచ్చు.