E-Paper
Advertisement

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్
Advertisement

Korean Romantic Drama: భార్యను కాపాడలేకపోయిన బాధతో ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్లు చేసే ఫైర్‌ఫైటర్… మరోవైపు ఓ మెడికల్ తప్పిదంతో తన లైసెన్స్‌ నే కోల్పోయే పరిస్థితిలో ఉన్న డాక్టర్. తన కేసు నుంచి బయటపడేందుకు ఆ ఫైర్‌ఫైటర్‌ నే సాక్షిగా మార్చుకోవాలని డాక్టర్ ప్లాన్ చేస్తే ? అతడికి దగ్గరవుతున్న కొద్దీ నటనగా మొదలైన బంధం నిజమైన ప్రేమగా మారితే ? ప్రమాదాల మధ్య పుట్టిన ఈ ప్రేమకథే కొరియన్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ 911’ (Love 911). మరి ఈ సిరీస్ ను తెలుగులో చూడొచ్చా ? అంటే…

కథలోకి వెళ్తే…

కాంగ్-ఇల్ ఓ రెస్క్యూ ఫైర్‌ఫైటర్. ప్రమాదం ఎక్కడ జరిగినా ముందుగా అక్కడికి చేరుకుని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఇతరుల ప్రాణాలు కాపాడే అతడి జీవితంలో మాత్రం ఓ విషాదం మిగిలే ఉంటుంది. తన భార్యను కాపాడలేకపోయిన జ్ఞాపకం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధ నుంచి బయటపడ లేకపోయినా.. రెస్క్యూ ఆపరేషన్లలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడు.

Advertisement

మరోవైపు మి-సూ ఎమర్జెన్సీ మెడికల్ డాక్టర్. ఓ పేషెంట్‌ విషయంలో చేసిన మిస్టేక్ కారణంగా ఆమెపై కేసు నమోదవుతుంది. ఆ కేసు కారణంగా తన మెడికల్ లైసెన్స్‌ కు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కేసులో తనకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకోవడానికి మి-సూకు కాంగ్-ఇల్ అవసరం అవుతాడు. పేషెంట్ కుటుంబానికి సంబంధించిన ఓ గొడవలో కాంగ్-ఇల్‌ పై దాడి జరగడంతో… ఆ సంఘటనను కేసులో ఉపయోగించుకోవాలని ఆమె భావిస్తుంది.

కానీ కాంగ్-ఇల్ ఆమె మాటలను పట్టించుకోడు. దీంతో అతడికి మరింత దగ్గరవ్వాలని మి-సూ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అతను పని చేసే రెస్క్యూ టీమ్‌లో పారామెడిక్‌గా చేరుతుంది. మొదట కాంగ్-ఇల్‌ను తన కేసు కోసం ఒప్పించడమే ఆమె లక్ష్యం. అయితే కలిసి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న కొద్దీ… అతడి గతం, అతడి బాధ, అతడి వ్యక్తిత్వం మి-సూకు అర్థమవుతాయి. అలా తన స్వార్థంతో మొదలైన ప్రయత్నం క్రమంగా నిజమైన అనుబంధంగా మారుతుంది.

Advertisement

ఇద్దరూ కలిసి ప్రాణాలను కాపాడే సమయంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. కానీ మి-సూ మొదట తన దగ్గరకు వచ్చిన అసలు కారణం కాంగ్-ఇల్‌కు తెలిసినప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. తాను నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి తనను ఓ కేసు కోసం ఉపయోగించుకుందని తెలుసుకుని అతడు బాధపడతాడు. ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయంలో మి-సూ జీవితంలో మరో ఆరోగ్య సమస్య కూడా ఎదురవుతుంది.

ఇంతలో ఓ కూలిపోయిన భవనం శిథిలాల్లో కాంగ్-ఇల్ చిక్కుకుపోతాడు. అతడు ప్రాణాలతో బయటపడతాడో లేదో తెలియని పరిస్థితిలో మి-సూ అతడి కోసం పరుగెత్తుతుంది. మొదట ఓ కేసు నుంచి బయటపడేందుకు మొదలైన పరిచయం… చివరకు ఒకరి ప్రాణం కోసం మరొకరు పోరాడే స్థాయికి ఎలా చేరింది ? కాంగ్-ఇల్ తన గతాన్ని, మి-సూ చేసిన తప్పును పక్కనపెట్టి ఆమెను మళ్లీ అంగీకరిస్తాడా ? ప్రమాదం మధ్య వాళ్ల ప్రేమకు ఎలాంటి ముగింపు వస్తుంది ? అనేదే ‘లవ్ 911’లో చూడాల్సిన ఎమోషనల్ స్టోరీ.

తెలుగులోనూ చూడొచ్చు

గో సూ (Go Soo), హాన్ హ్యో-జూ (Han Hyo-joo), డాన్ లీ (Don Lee), కిమ్ సియోంగ్-ఓ (Kim Sung-oh) తదితరులు నటించిన ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామాకు జియాంగ్ గి-హున్ (Jeong Gi-hun) దర్శకత్వం వహించారు. 2012 డిసెంబర్ 19న విడుదలైన ఈ సినిమా రెండు గంటల నిడివితో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో ‘లవ్ 911’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. కొరియన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈ సినిమాను తెలుగులో కూడా చూడొచ్చు.

Read Also: ప్రియుడిని రిజెక్ట్ చేసిన పాపానికి ఇంత రచ్చనా ? మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ

Related News

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

జైలు నుంచి వచ్చిందే తమ్ముడి బెండ్ తీయడానికి.. రిహాబ్‌లో అన్నదమ్ముల మాస్ హంగామా… ఓటీటీలోకి ఇంటెన్స్ డ్రామా

24 ఏళ్లకే తండ్రి బాధ్యతలు తలపై పడితే… డైలీ సీరియల్ లెవెల్ గందరగోళం… క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పాడుబడిన పిచ్చాసుపత్రిలో సెక్యూరిటీ మిస్సింగ్… తీరా చూస్తే స్పైన్ చిల్లింగ్ విజువల్స్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ… గుండె జారిపోయే అడ్వెంచర్

Big Stories

Advertisement
×