Goboult Mustang Nitro: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారి పోయాయి. ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడుతున్నా, లేదా సరదాగా పాటలు వింటున్నా మంచి ఇయర్ బడ్స్ ఉంటే.. ఆ ఫీల్ ఏ వేరు. అయితే ఎక్కువ ధర పెట్టలేక, బెస్ట్ ఫీచర్లు కావాలనుకునే.. వారి కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. యూత్ మనసు దోచుకుంటున్న ఈ ట్రెండింగ్ ఇయర్ బడ్స్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీమియం ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ సాధారణంగా వేలల్లో.. ధర ఉంటాయి. కానీ ఈ బోల్ట్ ముస్తాంగ్ నిట్రో అసలు ధరకు దీటుగా ప్రస్తుతం ఆఫర్లలో భాగంగా కేవలం రూ.1,999 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. కేవలం రెండు వేల రూపాయల బడ్జెట్‌లో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇస్తుండటంతో .. దీన్ని కొనడానికి టెక్ లవర్స్ ఎగబడుతున్నారు.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ ఇందులో ఉండే.. 32dB ANC ఫీచర్. మనం బస్సులు, రైళ్లు లేదా రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసరమైన సౌండ్స్‌ను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పాటలు వినొచ్చు లేదా ఆఫీస్ మీటింగ్స్‌లో మాట్లాడొచ్చు.
బ్రిటిష్ కాలం నాటి ఛార్జింగ్ టెన్షన్ ఈ ఇయర్ బడ్స్‌తో ఉండదు. ఇందులో ఉండే పవర్ ఫుల్ బ్యాటరీ కేస్‌తో కలిపి మొత్తంగా 72 గంటల పాటు ప్లేటైమ్ లభిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా రోజుల తరబడి దీన్ని వాడుకోవచ్చు. అలాగే.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్ది సేపు ఛార్జ్ చేస్తే.. గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.
Also Read: రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం
ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు.. అవతలి వైపు వారికి మన గొంతు స్పష్టంగా వినిపించడం చాలా ముఖ్యం. అందుకే ఇందులో బెస్ట్ టెక్నాలజీని ఇచ్చారు. ఇది చుట్టూ ఉన్న గాలి శబ్దాన్ని తగ్గించి మీ మాటలను ఎదుటి వారికి క్లియర్‌గా చేర వేస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న 13mm డ్రైవర్స్ అద్భుతమైన బేస్, ట్రెబుల్‌ను అందిస్తాయి. గేమ్స్ ఆడేవారికి లేదా మాస్ సాంగ్స్ వినేవారికి ఇది నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది.
మొత్తంగా చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్ , పవర్‌ఫుల్ సౌండ్ కోరుకునే వారికి ఈ మోడల్ బ్లూటూత్ హెడ్‌సెట్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ. 1,999 ధరలో ఇంతకంటే.. మంచి ఫీచర్లు దొరకడం కష్టం. మీరు కూడా ఒక మంచి వైర్ లెస్ ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే దీన్ని నిస్సందేహంగా ఆర్డర్ చేయొచ్చు.