E-Paper
Advertisement

‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ వేడుక.. చీఫ్ గెస్ట్ గా హ్యూమనాయిడ్ రోబోట్!

‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ వేడుక.. చీఫ్ గెస్ట్ గా హ్యూమనాయిడ్ రోబోట్!
Advertisement

AI Education Summit – 2026: కాలం మారుతున్న కొద్దీ మనిషి తన మెదడుకు పదును పెడుతూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసింది.. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ ఏ విధంగా అయితే అందుబాటులోకి వచ్చి మనిషి సాంకేతిక పనులను సులభతరం చేసిందో.. శారీరక శ్రమను తగ్గించడంలో రోబోట్ లు కూడా అంతే ప్రాధాన్యత వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో ఉన్న రోబోట్ లలో కాలానుకనుగుణంగా వినూత్న మార్పులు జరుగుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. విద్యార్థులు తమ తెలివితేటలను ఉపయోగించి తయారు చేస్తున్న ఈ రోబోట్ లు.. ఇప్పుడు ప్రత్యేక ప్రదర్శనకు ఉంచడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో అట్రాక్టివ్ అంశం ఏమిటంటే గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గచ్చిబౌలిలో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణ:

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న అరేనేషా ఏఐ హబ్ (Arenesha AI Hub) ఆధ్వర్యంలో ‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సమ్మిట్‌కి యూనిట్రీ జీ1 (Unitree G1) హ్యూమనాయిడ్ రోబోట్ ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలో ఇస్రో (ISRO) ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

ప్రధాన ముఖ్యాంశాలు:

Advertisement

రోబోట్లే ముఖ్య అతిథి:

విద్యార్థులు తమ సొంత రోబోట్ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించగా, హ్యూమనాయిడ్ రోబోట్ ఈ సమ్మిట్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Advertisement

ఏఐ హ్యాకాథాన్:

విద్యార్థుల కోసం రోజంతా ఏఐ హ్యాకాథాన్ నిర్వహించబడింది. విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్ట్‌లను న్యాయనిర్ణేతల ముందు ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

నూతన్ (ఫౌండర్ & సీఈఓ) గారి సందేశం:

“ఏఐ మనుషులను భర్తీ చేయదు, కేవలం పనులను మాత్రమే సులభం చేస్తుంది. పునరావృతమయ్యే మరియు కష్టమైన పనులను రోబోట్లు చేస్తాయి. మనుషులకు సృజనాత్మకత, ఆలోచనా శక్తి చాలా ముఖ్యం. ఏఐతో పోటీ పడటం కాదు, ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి” అని నూతన్ తెలిపారు.

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!also read:

అరేనేషా ఏఐ హబ్ గురించి:

2024లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ హబ్, విద్యార్థులకు మరియు బిల్డర్లకు ఫిజికల్ ఏఐ (Physical AI) మరియు ఎడ్జ్ ఏఐ (Edge AI) రంగాలలో శిక్షణ ఇస్తుంది. ‘రోబోఎడిఫై’ (RoboEdify) కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోబోటిక్స్ మరియు ఏఐలో ప్రాక్టికల్ నైపుణ్యాలను అందిస్తోంది.

Related News

దీపావళి స్పెషల్.. ఇంటికి గ్రాండ్ లుక్ ఇచ్చే.. చౌకైన ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్స్!

మార్కెట్‌లో దుమ్ములేపుతున్నఇయర్ బడ్స్..ఇలాంటి మోడల్ ఒక్కటైనా ఉండాలి

రష్యా ల్యాబ్‌లో బాక్టీరియా లీక్.. 28 ఏళ్ల ఉద్యోగిని మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ‘ప్లేగ్’ భయం!

రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం

ఆఫర్ ధర కన్నా లాంచ్ ధరే తక్కువ.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ వెనుక పెద్ద స్కెచ్, కొనేముందు జాగ్రత్త!

45% డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!

Big Stories

Advertisement
×