Sanjeev Goenka On Nita Ambani: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓనర్ నీతా అంబానీపై (Nita Ambani) లక్నో సూపర్ జెయింట్స్ ( LSG) యజమాని సంజీవ్ గోయెంకా ( Sanjeev Goenka) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లాంటి నలుగురు తోపు ఆటగాళ్లను నీతా అంబానీ ఎలా భరిస్తుందోనని… ఇది పెద్ద మిరాకిలే అంటూ వ్యాఖ్యానించారు. ఈ నలుగురు పెద్ద క్రికెటర్లకు ఈగో ఎక్కువగానే ఉంటుందని, అయినప్పటికీ తన బిజినెస్ మైండ్ సెట్ తో ముంబై ఇండియన్స్ ను నీతా నడిపిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఈ పెద్ద ఆటగాళ్లను ఎన్నో ఏళ్లుగా ఒకే తాటిపై ఉంచడం చాలా రిస్క్ అన్నారు. కానీ నీతా మాత్రం ఈ విషయంలో చాలా గ్రేట్ అని కొనియాడారు. రిలయన్స్ కంపెనీని నడిపినట్టుగానే ముంబై ఇండియన్స్ ను ముందుకు నడిపిస్తున్నట్టు ప్రశంసలు కురిపించారు. దీంతో నీతా అంబానీపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లాంటి నలుగురు తోపు ఆటగాళ్లు సింహాల లాంటి వాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా వెల్లడించారు. అలాంటి నలుగురిని భరించడం నీతా అలవాటైందన్నారు. క్రికెట్ పై అపారమైన అనుభవం ఉన్న నేపథ్యంలోనే ఆ నాలుగు సింహాలను ఒకే గూడులో ఉంచి, సత్పలితాలను రాబడుతోందని వ్యాఖ్యానించారు. నీతాను స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలని సూచనలు చేశారు.
ముంబై జట్టులో ఉన్న ఈ నలుగురు క్రికెటర్లు కెప్టెన్ స్థాయి వాళ్లేనన్నారు. అందరూ కెప్టెన్సీ అడగకుండా రోహిత్ శర్మను కొనసాగించి, 5 టైటిల్స్ గెలిచేలా నీతా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు పాండ్యాకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. అవసరమైనప్పుడు సూర్య, బుమ్రాకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నడూ కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ ఏ రోజున తిరుగుబాటు చేయాలని తెలిపారు. అందుకే నీతాను చూసి, మిగతా ఫ్రాంచైజీల ఓనర్లు చాలా నేర్చుకోవాలని సూచనలు చేశారు. ఇది ఇలా ఉండగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికే 5 ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకుంది ముంబై ఇండియన్స్. అయితే, హర్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గత రెండు సీజన్లలో ముంబై పెద్దగా ప్రదర్శన చేయడం లేదు. కానీ 2027లో గురి తప్పదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది.