Face ID Smart Locks: ఇంటి భద్రతను పటిష్టం చేసేందుకు స్మార్ట్ లాక్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. తాళాలు, వేలిముద్రలు అవసరం లేకుండా ముఖాన్ని చూపించగానే తెరుచుకునే ‘ఫేస్ ఐడీ’ (Face ID) సాంకేతికతతో కూడిన స్మార్ట్ డోర్ లాక్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఫేస్ ఐడీ స్మార్ట్ లాక్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.
తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లు కోరుకునే వారికి ‘డెల్టా జెడ్1 ప్రో’ బెస్ట్ ఆప్షన్. ఆధునిక ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌తో వచ్చే ఈ స్మార్ట్ లాక్.. ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. దీని ధర మార్కెట్లో రూ. 18,490 వరకు ఉంది. బడ్జెట్ ధరలోనే ఇంట్లో సెక్యూరిటీని పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.
ఆకర్షణీయమైన డిజైన్, సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ ఈ ‘నేటివ్ లాక్ ఆల్ట్రా’ ఫేస్ లాక్ ను రూపొందించారు. ఇందులోని ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ త్వరితగతిన ముఖాన్ని గుర్తించి తలుపు తెరుచుకునేలా చేస్తుంది. దీని ధర సుమారు రూ. 22,499 గా ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్‌లో అత్యుత్తమ క్వాలిటీ కోరుకునే వారికి ఇది సరిపోతుంది.
హోమ్ అప్లయన్సెస్ రంగంలో మంచి గుడ్ విల్ కలిగిన ఆటమ్‌బర్గ్ బ్రాండ్ నుంచి వచ్చిన స్మార్ట్ డోర్ లాక్ యూజర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘ఆటమ్‌బర్గ్ సైఫర్ ఎలైట్’ ఫేస్ రికగ్నిషన్‌తో పాటు మరిన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 27,999గా ఉంది. ప్రీమియం ఫీచర్లను కోరుకునే యూజర్లకు ఇది సాలిడ్ ఆప్షన్.
ఓజోన్ నుంచి వచ్చిన హై-ఎండ్ మోడల్ మెరుగైన నాణ్యతా ప్రమాణాలు, సూపర్ ఫాస్ట్ ఫేస్ ఐడీ సెన్సార్లు, అత్యాధునిక సెక్యూరిటీ అల్గారిథమ్స్‌తో పనిచేయనుంది. దీని ధర సుమారు రూ. 67,355గా నిర్ణయించారు. వర్క్‌స్పేస్‌లు, విల్లాలు, వీవీఐపీ ఇళ్లకు ఇది కట్టుదిట్టమైన భద్రతను అందిస్తుంది.
Also Read: మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఇన్ని పనులు చేయొచ్చా? దిమ్మతిరిగే షాకింగ్ నిజాలు!
స్మార్ట్ డోర్ లాక్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ‘యేల్’ అందిస్తున్న అత్యంత విలాసవంతమైన మోడల్ ‘యేల్ లూనా ప్రో+’. లేటెస్ట్ 3D ఫేస్ ఐడీ టెక్నాలజీ, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్లో రూ. 99,908 ధర కలిగి ఉన్న ఈ లాక్.. సాలిడ్ సెక్యూరిటీ, లగ్జరీ లుక్ కోరుకునే వారికి సరిగ్గా సరిపోతుంది.
Also Read: శాలరీ అకౌంట్ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?