E-Paper
Advertisement

ట్విస్ట్ అంటే ఇది.. ఆ మొబైల్‌ను క్యాన్సిల్ చేసి, ఏకంగా 7200mAh బ్యాటరీతో వస్తున్న iQOO కొత్త ఫోన్!

ట్విస్ట్ అంటే ఇది.. ఆ మొబైల్‌ను క్యాన్సిల్ చేసి, ఏకంగా 7200mAh బ్యాటరీతో వస్తున్న iQOO కొత్త ఫోన్!
Advertisement

iQOO Z11: మొబైల్ ప్రియులకు ఐకూ (iQOO) సంస్థ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలోనే సరికొత్త జెడ్ సిరీస్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. అదే సమయంలో కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐకూ 16 లాంచ్‌ను రద్దు చేసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాబోయే సరికొత్త ఫోన్ పైనే పడింది.

ఐకూ Z11 టీజర్ వచ్చేసింది..

ఐకూ ఇండియా సీఈఓ నిపున్ మౌర్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. అందులో 11 అనే నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఐకూ Z11 భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోందని స్పష్టమవుతోంది. గతంలో వచ్చిన జెడ్10 సిరీస్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. ఎప్పటిలాగే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో మిడ్-రేంజ్ విభాగంలో ఈ ఫోన్ నిలవనుంది.

Advertisement

Also Read: మెటా వివరణ ఇచ్చినా తీరని అనుమానాలు.. WhatsApp కొత్త రూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

ఎలాంటి ఫీచర్లు ఉండొచ్చు?

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇందులో 12GB వరకు ర్యామ్, అలాగే సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చని అంచనా. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. గేమింగ్, వీడియోలు చూసేవారికి నచ్చేలా 1.5K రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను అందించనున్నారు.

కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్:

Advertisement

ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. వాటిలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉండనుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరా ఇవ్వడం విశేషం. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీ, దానికి సపోర్ట్ చేసేలా 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 లేదా IP69 రేటింగ్ ఉండొచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ఈ ఫోన్ లాంచ్ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం సర్టిఫికేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో త్వరలోనే మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ధర విషయానికి వస్తే.. ప్రీమియం మిడ్‌రేంజ్ బడ్జెట్లో అంటే రూ.30,000 నుండి రూ.35,000 మధ్యలో ఇది అందుబాటులోకి రావచ్చు. అయితే ఇవన్నీ లీకుల ఆధారంగా వచ్చిన వివరాలు మాత్రమే. పూర్తి వివరాలు కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: వాట్సప్‌లోనే డైరెక్ట్‌గా బిజినెస్ సెర్చ్.. మెటా ఏఐతో కస్టమర్ సపోర్ట్ మరింత ఈజీ!

Related News

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

Big Stories

Advertisement
×