E-Paper
Advertisement

పోకీమాన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. గూగుల్ కొత్త ఫిట్‌బిట్ వచ్చేసిందోచ్!

పోకీమాన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. గూగుల్ కొత్త ఫిట్‌బిట్ వచ్చేసిందోచ్!
Advertisement

Fitbit Air: పోకీమాన్ అభిమానులకు గూగుల్‌ నుంచి కొత్త సర్‌ప్రైజ్ వచ్చింది. పోకీమాన్ స్లీప్ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు Fitbit Air Pokemon Sleep Editionను కంపెనీ అధికారికంగా తీసుకొచ్చింది. చిన్నగా, స్క్రీన్ లేకుండా ఉండే ఈ ట్రాకర్‌లో ఫిట్‌బిట్ హెల్త్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లతో పాటు పికాచు థీమ్‌ను జోడించారు. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్ అన్ని దేశాల్లో అందుబాటులోకి రావడం లేదు.

పికాచు థీమ్‌తో ప్రత్యేక డిజైన్:

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్‌లో Sleepy Blue కలర్ బ్యాండ్‌ను అందించారు. దీనిపై నిద్రపోతున్న పికాచు డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. స్క్రీన్ లేకపోవడంతో రాత్రిపూట ధరించినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు.

హెల్త్, స్లీప్ ట్రాకింగ్:

Advertisement

ఈ ట్రాకర్ నిద్ర సమయం, స్లీప్ స్టేజెస్‌తో పాటు 24/7 హార్ట్ రేట్, రెస్టింగ్ హార్ట్ రేట్, HRV, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రిథమ్ వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది. కొన్ని వర్కౌట్లను ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేసే సదుపాయం కూడా ఉంది.

Also Read: ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..

Pokemon Sleepతో కనెక్షన్:

Advertisement

ఈ ఎడిషన్ ప్రత్యేకత పోకీమాన్ స్లీప్ ఇంటిగ్రేషన్. ట్రాక్ చేసిన నిద్ర వివరాలను పోకీమాన్ స్లీప్ యాప్‌లో ఉపయోగించుకోవచ్చు. నిద్ర ఆధారంగా పోకీమ్యాన్‌లను కలెక్ట్ చేసే అనుభవాన్ని ఇది మరింత ఆసక్తికరంగా చేస్తుంది. హెల్త్ డేటాను గూగుల హెల్త్ యాప్‌లో కూడా చూడొచ్చు.

ధర, లభ్యత:

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్ ధర సుమారు రూ.12,420గా ఉంది. సాధారణ ఫిట్‌బిట్ ఎయిర్ ధరతో పోలిస్తే ఇది రూ.2,863 ఎక్కువ. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. ప్రస్తుతానికి అమెరికా, జపాన్ మార్కెట్లలో మాత్రమే ప్రకటించగా.. భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.

Also Read: Xiaomi 18 Fold లీక్.. అచ్చం ఐఫోన్ అల్ట్రాను తలపించే డిజైన్!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×