E-Paper
Advertisement

ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..

ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..
Advertisement

Wi-Fi Speed Tips: ఇంట్లో వైఫై సిగ్నల్ సరిగ్గా అందకపోవడం, స్పీడ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా? రూటర్‌ను సరైన చోట పెట్టడం, Wi-Fi బ్యాండ్ మార్చడం, ఛానెల్‌ను మార్చడం, ఫర్మ్‌వేర్ అప్‌డేట్ చేయడం వంటి సాధారణ మార్గాలు చాలాసార్లు ఉపయోగపడతాయి. అయితే మీ ఇంట్లోని స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్లు కూడా వైఫై పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకేసారి చాలా పరికరాలు కనెక్ట్ అయి ఉంటే సమస్య మరింత పెరగొచ్చు.

అసలు సమస్య బ్యాండ్‌విడ్త్ కాదు:

స్మార్ట్ ప్లగ్స్, స్మార్ట్ బల్బ్స్, స్విచ్‌లు, సెన్సార్లు వంటి పరికరాలు సాధారణంగా చాలా తక్కువ డేటానే ఉపయోగిస్తాయి. ఒక్కో పరికరం 1 Mbps కంటే తక్కువ డేటాను వినియోగించినా.. పెద్ద సంఖ్యలో పరికరాలు ఒకేసారి కమ్యూనికేట్ చేస్తే వైఫై పనితీరు తగ్గొచ్చు. దీనికి ప్రధాన కారణం నెట్‌వర్క్ ఎయిర్‌టైమ్‌పై పెరిగే ఒత్తిడి.

Advertisement

Also Read: Xiaomi 18 Fold లీక్.. అచ్చం ఐఫోన్ అల్ట్రాను తలపించే డిజైన్!

ఎక్కువ డివైజ్‌లతో ట్రాఫిక్ జామ్:

ఒక వైఫై ఛానెల్‌ను హైవేగా ఊహించుకుంటే.. కనెక్ట్ అయిన ప్రతి డివైజ్ ఒక వాహనం లాంటిది. ఒకేసారి ఎక్కువ పరికరాలు డేటా పంపడం, స్వీకరించడం వల్ల నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ పెరుగుతుంది. ఒకే ఛానెల్‌లో సాధారణంగా పరికరాలు తమ వంతు కోసం వేచి ఉండాల్సి రావడంతో వైఫై స్పందన నెమ్మదించవచ్చు.

ఇలా ట్రై చేయండి:

Advertisement

చాలా స్మార్ట్ హోమ్ పరికరాలు 2.4GHz బ్యాండ్‌పైనే పనిచేస్తాయి. అందుకే వాటిని 2.4GHzలో ఉంచి, ఫోన్లు, స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాలను 5GHz బ్యాండ్‌కు మార్చడం ఉపయోగపడుతుంది. అవసరమైతే స్మార్ట్ డివైజ్‌ల కోసం ప్రత్యేక గెస్ట్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయొచ్చు.

ఒకవేళ ఎక్కువ పరికరాలుంటే?

ఇంట్లో స్మార్ట్ పరికరాలు ఎక్కువగా ఉంటే మెష్ వైఫై సిస్టమ్ మంచి పరిష్కారం కావచ్చు. ఇది ఒకే రూటర్‌పై మొత్తం భారం పడకుండా, పలు రోడ్స్ ద్వారా కనెక్షన్‌ను విస్తరిస్తుంది. దీంతో ఇంటి అంతటా మెరుగైన కవరేజ్‌తో పాటు ఎక్కువ డివైజ్‌లను నిర్వహించడం సులభమవుతుంది.

Also Read: విడుదలకు ముందే హ్యాకర్ల చేతికి Ai+ Nova 2 Power 5G ఫోన్.. ఇదో కొత్త ప్రయోగం!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×