E-Paper
Advertisement

Xiaomi 18 Fold లీక్.. అచ్చం ఐఫోన్ అల్ట్రాను తలపించే డిజైన్!

Xiaomi 18 Fold లీక్.. అచ్చం ఐఫోన్ అల్ట్రాను తలపించే డిజైన్!
Advertisement

Xiaomi 18 Fold: షియోమీ నుంచి రాబోతున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ Xiaomi 18 Foldపై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో.. తాజాగా లీకైన రియల్ లైఫ్ ఫొటోలు డిజైన్‌పై మరింత క్లారిటీ ఇచ్చాయి. ముఖ్యంగా దీని వైడ్ బాడీ, రెడ్ ఫినిష్, హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ చూస్తే.. రూమర్స్‌లో ఉన్న ఐఫోన్ అల్ట్రా గుర్తుకు రావడం ఖాయం.

వైడ్ డిజైన్‌తో Xiaomi 18 Fold:

చైనీస్ టిప్‌స్టర్ వీబోలో షేర్ చేసిన లీక్ ఫొటోల ప్రకారం.. Xiaomi 18 Fold సాధారణ బుక్‌స్టైల్ ఫోల్డబుల్స్ కంటే కాస్త వెడల్పుగా, స్క్వేర్ తరహా ఆకారంలో కనిపిస్తోంది. అన్‌ఫోల్డ్ చేసినప్పుడు పెద్ద స్క్రీన్‌ను మరింత సౌకర్యంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

రెడ్ కలర్‌లో స్పెషల్ లుక్:

Advertisement

ఈ ఫోన్ వెనుక భాగంలో కనిపిస్తున్న రెడ్ ఫినిష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదే రంగు, రూమర్స్‌లో వినిపిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లోని డార్క్ చెర్రీ షేడ్‌ను కూడా గుర్తు చేస్తోంది. దీంతో రెండు ఫోన్ల డిజైన్‌పై పోలికలు వస్తున్నాయి.

Also Read: విడుదలకు ముందే హ్యాకర్ల చేతికి Ai+ Nova 2 Power 5G ఫోన్.. ఇదో కొత్త ప్రయోగం!

హారిజాంటల్ కెమెరా మాడ్యూల్:

Advertisement

Xiaomi 18 Fold వెనుక భాగంలో పైభాగం అంతటా విస్తరించిన హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో మూడు కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోని పొడవైన కెమెరా మాడ్యూల్స్‌కు భిన్నంగా షియోమీ ఈసారి కొత్త లుక్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

Xring O3 చిప్‌తో రానున్న ఫోన్:

షియోమీ ఇప్పటికే 18 Fold సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందని ధృవీకరించింది. ఈ ఫోన్‌లో కంపెనీ కొత్త Xring O3 చిప్ అందించనుంది. ఈ ప్రాసెసర్ AnTuTuలో 5.22 మిలియన్లకు పైగా స్కోర్ సాధించినట్లు సమాచారం. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు, ధరపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Also Read: Realme C100i 4G లాంచ్.. రూ.14,999కే ఇన్ని ఫీచర్లా? పూర్తి వివరాలు మీ కోసం!

Tags

Related News

రూ.1.30 లక్షల iPhone 17 Pro ఇప్పుడు రూ.80 వేల లోపే.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

ఫోన్ లేకుండానే టీవీలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. మెటా కొత్త ఫీచర్ ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

టెలికాం సంస్థలకు TRAI డెడ్‌లైన్.. 15 రోజుల్లో ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టకపోతే భారీ జరిమానా!

కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

Big Stories

Advertisement
×